అల్లుడి కోరిక తీర్చడానికి మెగాస్టార్ రెడీ !

మరో హీరో  మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి సినీ రంగ ప్రవేశం చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కళ్యాణ్ వెండితెరపై అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  పెళ్లి సమయానికే  ‘హీరోకావాలని’ అతను కోరుకుంటున్న విషయం తెలిసింది.  ప్రస్తుతం పలువురు హీరోలతో విరాజిల్లుతున్న ‘మెగా ఫ్యామిలీ’ కి ఇదేమంత కష్టమైన విషయం కాదుగా. మెగాఫ్యామిలీ నుండి వచ్చే   కళ్యాణ్  సినీ ప్రవేశం కోసం  గత కొంతకాలంగా వైజాగ్ లో నటశిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇంతకుముందు పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, మహేష్ బాబు లాంటి బడా హీరోలకు శిక్షణ ఇచ్చిన సత్యానంద్ దగ్గర ఇతని శిక్షణా పాఠాలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు, తన ఫిజిక్ విషయంలోనూ కళ్యాణ్ తగిన జాగ్రత్తలు పడుతున్నాడని తెలిసింది. ఇప్పటికే పలుదర్శకుల వద్ద కథలు కూడా వినడం స్టార్ట్ చేశాడని, సరియైన కథ దొరకగానే ఓకే చెప్పేయాలని చూస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల మాట.