నితిన్ ఫ్రెండ్ కి వెల్లువెత్తిన ఆఫర్లు !

మేఘా ఆకాశ్‌…  ఆమె చేసిన  ‘లై’..’చల్ మోహన్ రంగా’ చిత్రాలు బాక్స్‌ఆఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ  వరుస అవకాశాలు వరించడం విశేషం. సాధారణంగా పరాజయాల్లో ఉన్న కథానాయికలకు ఎవరూ అవకాశాలివ్వరు. అయితే కొంత మంది భామలను మాత్రం అదృష్టం వెంబడించి  పట్టుకుంటుంది. అందాల మేఘా ఆకాశ్‌ది అదే పరిస్థితి. అమ్మడికి టాలీవుడ్‌లో వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. అయితే ఇక్కడ లక్కు కలసిరాక పోయినా.. మదర్ ల్యాండ్ కోలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అందులోనూ స్టార్ హీరోల సరసన కథానాయికగా వరుస ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నిజానికి మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసింది తమిళ చిత్రంతోనే. ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ చిత్రం ఇప్పటి వరకూ రిలీజ్‌కే నోచుకోలేదు. ఈ నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా వచ్చేలోపే తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’..’చల్ మోహన్ రంగా’ సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది మేఘా. ఆచిత్రాల సమయం లోనే నితిన్ ఆమెతో ప్రేమలో పడ్డట్టు వార్తలొచ్చాయి. ‘లై’..’చల్ మోహన్ రంగా’  రెండూ బాక్స్‌ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయినప్పటికీ అమ్మడిని వరుస అవకాశాలు వరించడం విశేషంగా మారింది.
మేఘా ఏకంగా రజనీ ‘పేట్ట’ లోనే అవకాశం దక్కించుకుంది. ఇదే కాకుండా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో సమంతా పాత్ర కూడా కొట్టేసింది. ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి. ఇంతకంటే సూపర్ ఆఫర్లు ఇంకేముంటాయి? ఈ రెండూ కాకుండా ‘బూమరాంగ్’.. ‘శాటిలైట్ శంకర్’ అనే సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలు డిజప్పాయింట్ చేసినా కోలీవుడ్లో  మాత్రం మేఘ జోరు మామూలుగా లేదు.