‘ఫ్రస్ట్రేషన్’ నుండి ‘ఫన్’ లోకి వచ్చింది !

మెహ‌రీన్ కౌర్ పిర్జాదా… నాని కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమైన అందాల భామ మెహ‌రీన్ కౌర్ పిర్జాదా. ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో మెహ‌రీన్ న‌ట‌న‌కి పెద్ద‌గా మార్కులు ప‌డ‌క‌పోయిన ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డికి ‘మహానుభావుడు’ వంటి హిట్ చిత్రంలో నటించే అవ‌కాశం ద‌క్కింది. ఆ త‌ర్వాత మెహ‌రీన్ న‌టించిన ‘కేరాఫ్ సూర్య’, ‘జవాన్’,’రాజా ది గ్రేట్’ ‘పంతం’, ‘నోటా’ చిత్రాలు అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి .దీంతో తెలుగులో మెహ‌రీన్ ప‌ని అయిపోయింద‌నుకున్న స‌మ‌యంలో ‘ఎఫ్‌2’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.
 
అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జ‌త్టక‌ట్టింది మెహ‌రీన్ . హ‌నీ అనే పాత్ర‌లో మెహ‌రీన్ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆకట్టుకుంది.ముఖ్యంగా లవర్ ని ఇబ్బందులకు, ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పెత్తనం గల అమ్మాయిగా, హాని పాత్రలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ చిత్రంతో మెహ‌రీన్‌కి మ‌రిన్ని ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం అంటున్నారు. ప్ర‌స్తుతం మెహ‌రీన్ .. పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఐద‌వ చిత్రంలో మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు మేక‌ర్స్‌. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ తెర‌కెక్కించ‌నున్నాడు.