వెండితెరపై మైఖేల్‌ జాక్సన్‌ జీవితం

సంగీత ప్రపంచంలో ‘థ్రిల్లర్‌’ సింగర్‌ ఎవరు… అని అడిగితే మొదట గుర్తొచ్చేది మైఖేల్‌ జాక్సన్‌ పేరే . ఇప్పుడు అతని జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతుందని వార్తలొస్తున్నాయి. మైఖేల్‌ జాక్సన్‌ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు.అది వ్యక్తి పేరు కాదు.. థ్రిల్లర్‌ మ్యూజిక్‌కు ఓ బ్రాండ్‌. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం’త్రిల్లర్’ (Thriller) జాక్సన్ పాడిందే. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్‌ మోతాదుకు మించి నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల 50 ఏళ్లకే అర్థాంతరంగా కన్నుమూశారు.

మైఖేల్‌ జాక్సన్‌ చిత్రంలో నటీనటులు .. దర్శకుడు.. అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. జాక్సన్‌ మరణం తర్వాత 2009లో అతని బయోపిక్‌ను వెండితెరపై ఆవిష్కరించాలని ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత గ్రహమ్‌ కింగ్‌ భావించాడు. అందుకోసం అన్ని హక్కులు సంపాదించాడు. కానీ అతను పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సినిమాలకు దూరమైపోయారు. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ హౌస్‌ సహకారంతో.. ఆయనే కో ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తూ న్నాడు. ఆ విషయాన్ని హాలీవుడ్‌ మీడియా పేర్కొంటోంది. ‘ఏవియేటర్‌’కు కథ అందించిన జాన్‌ లగాన్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ రాయబోతున్నారు. మైఖేల్‌ జాక్సన్‌ చిన్న వయసులో స్టార్‌గా ఎలా ఎదిగాడు? గ్లోబల్‌ ఐకాన్‌ మారి.. 2009లో మరణం వరకూ.. జాక్సన్‌ జీవితాన్ని ఇందులో చూపించబోతున్నారు.