మరణించినా మిలియన్ల కొద్దీ సంపాదన

పాప్ రారాజు మైకేల్ జాక్సన్… పాప్ సామ్రాజ్యాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు మైకేల్ జాక్సన్. తానూ స్టెప్పు వేసాడంటే చాలు యువత పిచ్చెక్కిపోయేది. బతికి ఉన్నంత కాలం తిరుగులేని స్టార్ గా చెలామణి అయిన మైకేల్ జాక్సన్ చనిపోయాక కూడా సంపాదిస్తూ తన ఆధిక్యాన్ని చాటుకుంటున్నాడు. చనిపోయి కూడా సంపాదిస్తున్న వారి వివరాలను ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రచురించింది. అందులో మైకేల్ జాక్సన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది మైకేల్ జాక్సన్ ఏకంగా 400 మిలియన్లను సంపాదించాడు. జాక్సన్ బతికి ఉన్నపుడు లండన్‌కు చెందిన ఈఎంఐ మ్యూజిక్‌ కంపెనీలో జాక్సన్‌కు వాటాలు తీసుకున్నాడు. దీంతో ఇప్పటికి కూడా జాక్సన్ ఎకౌంట్ లో నగదు జమ అవుతూనే ఉంది. మైకేల్ జాక్సన్ తర్వాత స్థానంలో మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ 31 మిలియన్‌ డాలర్లు సంపాదించి.. రెండవ స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు ఆర్నాల్డ్‌ పామర్ ఉన్నారు. ఈయన గతేడాది 27 మిలియన్ డాలర్లు సంపాదించాడు.