ఎ.సాయి కుమార్ `మిర్రర్` పాటలు విడుదల

శ్రీ మల్లిఖార్జున మూవీస్ పతాకం పై రూపొందుతోన్న చిత్రం `మిర్రర్ `, ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ .సాయి కుమార్ దర్శకుడు. శ్రీనాథ్, హరిత జంటగా నటించారు. నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎన్ . అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు.
ముఖ్య అతిథి నిర్మాత దామోదర్ ప్రసాద్ బిగ్ సీడీ ని ఆవిష్కరించి, మాట్లాడుతూ…“ప్రస్తుత సమాజంలో ఆడవారి పై జరుగుతోన్న వేధింపులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలి.మంచి ప్రయత్నాన్ని చేసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా“ అన్నారు.
మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ…“ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద విజయం తో సమానం.. అన్నారు .
మధుర శ్రీధర్ మాట్లాడుతూ …“ `మిర్రర్ ` టైటిల్ , పాటలు బావున్నాయి. మధుర ఆడియో ద్వారా పాటలు రిలీజ్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ “ అన్నారు.
సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ…“పాటలు కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ రాసే అవకాశం కల్పించిన దర్శకుడు సాయి కుమార్ గారికి ధన్యవాదాలు“ తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ …“సాయి కుమార్ చెప్పిన కథ, ఆయన పనితనం నచ్చి ఈ సినిమా చేసాం.చాలా బాగా వచ్చింది. సందేశం, వినోదం కలగలిసిన సినిమా “ అని తెలిపారు.
 
దర్శకుడు ఎ .సాయి కుమార్ మాట్లాడుతూ..“ కెమెరా ఆపరేటర్ గా చాలా సినిమాలకు పని చేసిన అనుభవం తో ఈ సినిమాకు డైరెక్షన్ చేశాను. ఆడవారిని వేధిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారిని తన ధైర్య సాహసాలతో ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొంది ?అనేది మా సినిమా కథాంశం. కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్నాయి. సినిమా విడుదల విషయం లో మాకు సహకరిస్తున్న గూడ రామకృష్ణ గారికీ , డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ గారికి కృతజ్ఞతలు “ చెప్పారు.
ఐటెం సాంగ్ లో సూఫీ ఖాన్, విఠల్ , మధు, డి. సుధాకర్ వినోద్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు కెమెరా- కె అశోక్ రెడ్డి ; మ్యూజిక్ -అర్జున్ ఎన్ ; ఎడిటర్-నరేష్ ; బ్యాక్ గ్రౌండ్ స్కోర్ -హర్ష ప్రవీణ్ ; ప్రొడ్యూసర్స్ -డి .లక్ష్మి నారాయణ, టి. అరుణ్ కుమార్ ; ఎన్ . అశోక్ కుమార్ ; డి .వినోద్ రాజ్ . స్టోరీ, స్క్రీన్ ప్లే ,డైరెక్షన్ -ఎ .సాయి కుమార్