ఆమె బాలీవుడ్ హీరోయిన్ లను భయపెడుతోంది !

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, బాలీవుడ్ నటి కరీనా కపూర్‌లు ఒక యాడ్‌లో నటించారు. ఈ ఒక్క యాడ్‌తోనే ఆమె కరీనాకు గట్టిపోటీగా నిలిచింది. ఇదే ఆరంభంగా మానుషి హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మానుషీ తాజాగా ఎనర్జిటిక్ యాక్టర్ రణవీర్ సింగ్‌తో చేతులు కలిపింది. వీరిద్దరూ కలిసి ఒక ప్రకటనలో కనిపించనున్నారు. తాజాగా ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అలాగే ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను చూసిన అభియానులు వీరిద్దరి కెమెస్ట్రీ బాగా పండిందని అంటున్నారు. దీనికి ముందు మానుషి… మలబార్ గోల్డ్ ప్రకటనలో నటించింది. ఈ ప్రకటనలో మానుషి సాంప్రదాయబద్ధంగా కనిపించి అదరగొట్టింది

కార్డియాలజిస్ట్‌ కావడం అనేది తన కల !
మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మన ఇండియన్స్‌ మెరిస్తే సిల్వర్‌ స్క్రీన్‌ ఆఫర్‌ చేస్తుంటారు. గతంలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా …. ఇప్పుడు తాజాగా మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌. అద్భుతమైన అందం మానుషి సొంతం. ఆ చిర్నవ్వుకే కొన్ని కోట్ల మంది అలా పడి ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో లెగ్‌ పెడితే ఇండస్ట్రీ షేక్‌ అవడం ఖాయం. కాని ఆమె మాత్రం ‘ముందు నా మెడిసిన్‌ పూర్తి చేయనివ్వండి’ అంటోంది. మానుషి కుటుంబం ఉండటం ఢిల్లీలోనే అయినా తను మాత్రం హర్యానాలోని సోనెపట్‌లో మెడిసిన్‌ చేస్తోంది. కార్డియాలజిస్ట్‌ కావడం అనేది తన కల.