‘మిస్టర్ పర్ఫెక్ట్’ పై రచయిత్రి ముమ్ముడి శ్యామల గెలిచింది !

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ‘Mr పర్ఫెక్ట్’ 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ కథ 2010లో విడుదలైన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవల నుంచి కాపీ కొట్టిందనే ఆరోపణలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది.దీనిపై రచయిత ముమ్ముడి శ్యామల దేవి చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు ముమ్మడి శ్యామలా దేవి రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల నుంచి తీసుకున్నదే అని సిటీ సివిల్ కోర్టు నిర్దారించింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలకు పోలీసు శాఖను ఆదేశించింది.
 
అప్పటి వరకు నాకు తెలియదు
2011లో సినిమా విడుదల సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. 2013లో టీవీలో ‘Mr పర్ఫెక్ట్’ సినిమా వస్తుంటే చూశాను. చూశాక వంద శాతం నా నవలను కాపీ చేసి తీశారని అర్థమైంది. అవే డైలాగులు, సీన్లు… కొన్ని చోట్ల మార్చడానికి ట్రైచేశారు కానీ… ప్రతీ సీను నా నవల నుంచి తీసుకున్నదే అని శ్యామలదేవి తెలిపారు.విషయం తెలుసుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజును సంప్రదించేందుకు ఆమె ప్రయత్నించాను. అయితే ఆయన అపాంట్మెంట్ ఇవ్వలేదు. కథా రచయితల సంఘంలో దశరథ్ 2009లోనే రిజిస్టర్ చేశారని చూపించే ప్రయత్నం చేశారు, కానీ అవన్నీ తప్పుడు ఆధారాలే అని రచయిత శ్యామలదేవి అన్నారు.
అన్ని సాక్ష్యాలు చూపించిన నన్నే ఇంతగా ఏడిపించారు. రైటర్స్ అసోసియేషన్లో కూడా చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ స్క్రిప్టు తీసుకున్న వెంటనే సంతకం పెట్టించుకుని దాన్ని మనకే ఇచ్చేస్తారు. వారి వద్ద మరో కాపీ ఉండదు. అదే గవర్నమెంట్ కాపీరైట్ అయితే లాకర్లో ఉంటుంది కాబట్టి ఆధారం ఉంటుంది. ఇంత గొడవ అయి రెండేళ్లు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి చార్జ్ షీట్ కోసం అడిగితే.. తూతూ మంత్రంగా వైట్ పేపర్ మీద జిరాక్స్ దశరథ్ సబ్‌మిట్ చేశారు. పేపర్లో కూడా అడ్వర్టైజ్ చేసుకున్నారని ముమ్మడి శ్యామలా దేవి తెలిపారు.
 
న్యాయం జరిగినందుకు సంతోషం
ప్రతి నవల 3 నెలల్లోపూర్తి చేస్తాను,ఇది సంవత్సరం పట్టింది. క్యారెక్టర్స్ అంత గొప్పగా తీర్చి దిద్దాను కాబట్టే ..ఎక్కువ సమయం తీసుకుంది. 30 సీన్ల వరకు ఉన్నది ఉన్నట్లు దించేశారు. ఏ రచయిత అయినా కోరుకునేది గుర్తింపే. అందుకే నేను న్యాయ పోరాటం చేశాను. ఆల్రెడీ చాలా భాషల్లో నా కథను సొమ్ము చేసుకున్నారు. ఇక మీద ఏమైనా తీస్తే నాకు క్రెడిట్ ఇవ్వాలని జడ్జిగారు తన తీర్పులో పేర్కొన్నారు.నా కథ కాపీ కొట్టి నా కెరీర్ దెబ్బతీశారు. ఈ పోరాటం మొదలు పెట్టిన తర్వాత కథలు రాయడం తగ్గించేశాను. నన్ను ఇంత బాధ పెట్టినందుకు కచ్చితంగా నష్టపరిహారం అడుగుతాను. నష్టపరిహారం అడిగేది కోట్లు సంపాయించడానికి కాదు, వారికి పనిష్మెంట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యమని శ్యామలదేవి తెలిపారు.