హీరోగా మారిన సంగీత దర్శకుడు గోపి సుంద‌ర్

త‌మిళంలో సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సాధించిన విజ‌య్ ఆంటోని న‌టుడిగా కూడా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఏ. ఆర్. రెహమాన్ మేనల్లుడు జి. వి. ప్రకాష్ కుమార్  హీరోగా మారి బాగా పాపులర్ అయ్యాడు.ఇప్పుడు మరో  సంగీత ద‌ర్శ‌కుడు న‌ట‌నపై దృష్టి పెట్టారు.

మ‌ల‌యాళ, తమిళ, తెలుగు భాష‌ల్లో  త‌న సంగీతంతో  ఎంత‌గానో ఆక‌ట్టుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపి సుంద‌ర్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘ఊపిరి’, ‘ప్రేమమ్’, ‘నిన్ను కోరి’, ‘రాజు గాడు’, ‘తేజ్ ఐ ల‌వ్ యూ’, ‘పంతం’, ‘జంబ‌లకిడి పంబ‌’ వంటి చిత్రాలకు మంచి సంగీతం అందించిన ఆయ‌న ప్ర‌స్తుతం ‘గీత గోవిందం’, ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.అతను సంగీతం అందించిన మోహన్ లాల్ ‘పులిమురుగన్’ ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్,బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీ ల్లో నామినేట్ కావడం విశేషం.

సంగీత ద‌ర్శ‌కుడు గోపి సుంద‌ర్ నట‌నపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో హ‌రికృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘టోల్ గేట్’ అనే సినిమా చేస్తున్నాడు గోపి సుంద‌ర్. “టాలెంటెడ్‌ అండ్‌ మై గుడ్‌ ఫ్రెండ్‌ గోపీ సుందర్‌ యాక్ట్‌ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్‌ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన గోపీ యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను మ్యాజిక్‌ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్‌ ఫస్ట్‌ లుక్‌ను మలయాళ యువ హీరో దుల్కర్ స‌ల్మాన్ రిలీజ్‌ చేశారు. ‘మిస్టర్‌ ఫ్రాడ్‌’, ‘సలాలా మొబైల్స్‌’ చిత్రాల్లో గెస్ట్‌ రోల్‌ చేసిన గోపీ సుంద‌ర్ ఇప్పుడు ‘టోల్ గేట్’ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయ‌నే అందిస్తున్నాడు.