విడుదలకి సిద్ధమైన ‘వేటాడేకళ్ళు’ !

జనార్దన్ , మధు , సారిక , అర్చన , పూజ , దుర్గారావు, వరప్రసాద్ లను తెలుగుతెరకు పరిచయం చేస్తూ చందమామ క్రియేషన్స్ పతాకంపై ఎన్ . కొండల్ రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం వేటాడే కళ్ళు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెలలోనే రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎన్. కొండల్ రావు మాట్లాడుతూ ” హర్రర్ నేపథ్యంలో మా ‘వేటాడే కళ్లు’ చిత్రం తెరకెక్కింది. జోగిని గా తెలంగాణ లో అత్యంత పాపులర్ అయిన ఇల్లందు సారిక ని తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రంలో సారిక కీలక  పాత్ర పోషించింది . సారిక తో పాటు ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లే నని , 25 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లతో పాటుగా కర్ణాటక లో కూడా షూటింగ్ చేసాం . మూడు పాటలు ఈ చిత్రంలో ఉన్నాయి ,అవన్నీ కూడా సందర్భానుసారం వస్తాయని ఈ నెలాఖరున సినిమాని రిలీజ్  చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
సారిక మాట్లాడుతూ… ” దర్శక నిర్మాత ఎన్ . కొండల్ రావు ఈ సినిమాలో నటించమని నా దగ్గరకు రెండుసార్లు వచ్చారు అయితే మొదట్లో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు కానీ మా అమ్మ వాళ్ళు నచ్చజెప్పడం తో ఒప్పుకున్నాను . నాకు మొదటి సినిమాలోనే మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మొదట్లో సినిమాలంటే ఇష్టం లేదు కానీ ఈ సినిమాలో నటించాకా సినిమాలపై గాలి మళ్లిందని తప్పకుండా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానన్నారు .