అంత‌ర్జాతీయ ఇండీ గేద‌రింగ్ అవార్డు గెలుచుకున్న `ర‌క్తం`

సామాజిక వేత్త, పద్మ‌శ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ‌న్ ఈ సినిమాను స‌మ‌ర్ప‌ణ‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ `నా బంగారు త‌ల్లి` డైరెక్ట‌ర్ రాజేష్ ట‌చ్ రివ‌ర్ రూపొందిస్తున్న చిత్రం `ర‌క్తం`. సోష‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ ఇండీ గేద‌రింగ్ 2017లో అవార్డును గెలుచుకుంది. ఫారిన్ డ్రామా ఫీచ‌ర్స్ సెగ్మెంట్‌లో ఈ అవార్డు వ‌చ్చింది.

సంజు శివ‌రామ‌, మ‌ధు శాలిని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌క్స‌లైట్స్ గ్రూపుకు చెందిన క‌థాశంతో సినిమాను రూపొందించారు. విప్ల‌వం ఆలోచ‌నాత్మ‌క విధానంలో సంఘ‌ర్ష‌ణ‌ల ఆధారంగా సినిమా ఉంటుంది. ఆల్బ‌ర్ట్ కామ‌స్ లెస్ జ‌స్టెస్ ఆధారంగా ఈ సినిమాను క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌ల్లో తెర‌కెక్కించారు. హింసాత్మ‌క మార్గంలోని నైతిక విలువ‌లు గురించి ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు రాజేష్ స్పృశిస్తున్నారు. మ‌ధుశాలిని డీ గ్లామ‌ర్ రోల్‌లో న‌టించింది. బెన‌ర్జీ కీల‌క పాత్రలో క‌నిపిస్తాడు. స‌నా, బిందు, జాన్ కొట్టొలి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు.

‘Raktham’: Rajesh Touchriver’s drama continues to receive acclaim

National Award-winning director Rajesh Touchriver of ‘Na Bangaru Thalli’ fame is coming up with a social drama titled ‘Raktham’ (The Blood).

Starring Sanju Sivram and Madhu Shalini (in a deglam avatar) in lead roles, the film tells the troubled stories of a group of naxals.  “It’s a film about the ethical conflicts within the ideology of revolution.  I was inspired by Nobel Peace Prize laureate Albert Camus’ ‘Les Justes’ in making the movie,” the talented director tells.
Probe more and you find out that the subject touches upon the moral issues involved in choosing a violent path.  “A group of political revolutionaries find themselves in a situation of internal conflict when they venture out to assassinate a union minister.  Things seem to fall apart as they get closer to the goal,” the director chips in.
Well-known character artiste Banjerjee has a key role, while Sana, Bindu, John Kottoly and Harish Chandra are playing other intense characters.
Shot in Hyderabad and Karimnagar, ‘Raktham’ is presented by social activist and Padma Shri-winner Sunitha Krishnan.
‘Raktham’ has been adjudged the winner at the 2017 Indie Gathering in Foreign Drama Feature segment.