మూడు భాషల్లో నాగఅన్వేష్‌, హెబ్బాపటేల్‌ ‘ఏంజెల్‌’

సోషియో ఫాంటసీ స్టోరీతో ‘ఏంజెల్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ‘బాహుబలి’ పళని. శ్రీ సరస్వతి ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై నాగఅన్వేష్‌, హెబ్బాపటేల్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ ‘ఏంజెల్‌’ ను ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకి గ్రాఫిక్స్‌ అందించిన కొందరు విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుల పర్యవేక్షణలో సిజి వర్క్స్‌ జరుగుతున్నాయి.

సినిమా షూటింగ్‌, రీరికార్డింగ్‌ తదితర కార్యక్రమాలు ఇప్పటికే ముగిశాయి. కానీ 40 నిమిషాలకి పైగా గ్రాఫిక్స్‌ కి సంబంధించిన సన్నివేశాలు సినిమాలో ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నట్లుగా నిర్మాత భువన్‌ సాగర్‌ తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించారు. సిజి పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’ని చెప్పారు.