నాగ్ అశ్విన్ నెక్ట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట !

సావిత్రి జీవితగాధను అద్భుతంగా తెరకెక్కించాడని అంతా మెచ్చుకుంటున్న నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ కన్ఫామ్ అయ్యింది. ‘మహానటి’తో సూపర్ అనిపించుకుంటోన్న ఈ దర్శకుడు ఓ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. తన డెబ్యూకి కొనసాగింపు కథని తయారుచేస్తున్నాడట.
 తెలుగు సినీజనాలను  ఇంప్రెస్ చేస్తోంది ‘మహానటి’. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. రాఘవేంద్రరావు నుంచి సుకుమార్ వరకు దర్శకులంతా నాగ్ అశ్విన్ ప్రయత్నానికి హట్సాఫ్ అంటున్నారు.  రెండో సినిమాతోనే మాయ చేశాడని, సావిత్రి జీవితగాధను అద్భుతంగా తెరకెక్కించాడని మెచ్చుకుంటున్నారు. సెకండ్ ప్రాజెక్ట్ తోనే టాలీవుడ్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిన నాగ్ అశ్విన్, నెక్ట్స్ ‘ఎవడే సుబ్రమణ్యం’కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ చర్చలు కూడా మొదలయ్యాయని చెబుతున్నారు.
 “అందమైన జీవితం డబ్బు, హోదాలో ఉండదు… నీలా నువ్వుండడమే నిజమైన లైఫ్” అనే కాన్సెప్ట్ తో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగీకి దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతోనే నాని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. వరుస విజయాలు అందుకున్నాడు. ఇప్పుడా ప్రాజెక్ట్ కే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఆల్రెడీ నేచురల్ స్టార్ తో సంప్రదింపులు జరిగాయని, త్వరలోనే స్వప్న సినిమాస్ లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందట.
పాతాళభైరవి లాంటి చిత్రం చేయాలని ఉంది !
కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక‌దత్, స్వ‌ప్నదత్ నిర్మించిన ‘మ‌హాన‌టి’ ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్ని శ‌నివారం ఉదయం ఆయ‌న ఇంట్లో స‌న్మానించారు.
 ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన వైజయంతి బ్యానర్‌లో మళ్లీ చేయాలని అనుకుంటున్నాను. పాతాళభైరవి లాంటి జానపద చిత్రం చేయాలని ఉంది. నాగ్ అశ్విన్ కూడా అలాంటి కథ తయారు చేసినట్టు చెప్పాడు. అన్నీ సెట్ అయితే నటించడానికి సిద్ధమే’’ అని అన్నారు.