తండ్రి బాటలో వ్యాపార రంగంలోకి…

నాగచైతన్య…  ఈ యంగ్ హీరో తండ్రి బాటలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకి సిద్ధమవుతున్నాడట. కొత్తతరం నటీనటులు కేవలం నటులుగానే కాకుండా బిజినెస్ మేగ్నెట్స్‌గానూ రాణిస్తున్నారు. సినిమా రంగంలో సంపాదించిన  డబ్బును ఇతర రంగాల్లోకి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా కొత్తతరం హీరోలు రెస్టారెంట్ బిజినెస్‌పై మోజు పెంచుకుంటుండగా నవతరం నాయికలైన తమన్నా, కాజల్ వంటి భామలు జ్యూయలరీ బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కినేని మూడోతరం వారసుడు నాగచైతన్య దృష్టి మాత్రం రియల్ ఎస్టేట్‌పై ఉందట.
తండ్రి నాగార్జున బాటలో చైతన్య కూడా సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. కొద్దిరోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో చైతూ, సమంత కలిసి కొత్తగా ఓ సౌండ్ స్టూడియో స్థాపించారు. ఇప్పుడు ‘మజిలి’కోసం సమంతతో పాటు విశాఖపట్టణంలో విహరిస్తున్న చైతన్య త్వరలో వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట.విశాఖలో సినిమా స్టూడియోలు వస్తాయని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోఅక్కడ భారీ స్థాయిలో భూములు కొనాలనే ప్రణాళికలు వేస్తున్నాడట నాగచైతన్య. అందుకోసం జీవితభాగస్వామి సమంతతో కలిసి వైజాగ్‌లో టాప్ రియల్టర్లను కలుసుకుని సమాచారం సేకరించే పనిలో ఉన్నాడట చైతన్య. సినిమాలతో పాటు రియల్ ఎస్టేజ్ బిజినెస్ విషయంలోనూ చైతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు
పిరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో
 అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య  ఓ పిరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘మజిలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంతలు కలిసి నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే చైతూ, సామ్‌ల లుక్‌లను రిలీజ్‌ చేసిన ‘మజిలి’ టీం తాజాగా సంక్రాంతి కానుకగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాగ చైతన్య క్రికెటర్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో మరో హీరోయిన్‌ దివ్యాంషా కౌషిక్ లుక్‌ను రివీల్ చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు.