కొంతవరకే అలరించిన…. ‘ఏంజెల్’ చిత్ర సమీక్ష

                                           సినీవినోదం రేటింగ్ : 2.5/5 
స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్‌ బ్యానర్ పై ‘బాహుబ‌లి’ ప‌ళ‌ని దర్శకత్వం లో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి సమర్పణలో భువ‌న్ సాగ‌ర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
నాని(నాగ అన్వేష్‌), గోపి(స‌ప్త‌గిరి) స్నేహితులు. అమ‌రావ‌తి ప‌ట్ట‌ణ నిర్మాణ తవ్వకాల్లో ఓ అరుదైన శిల్పం దొరుకుతుంది. దాన్ని మూడు కోట్ల రూపాయ‌ల‌కు కొనుక్కొంటాడు షాయాజీ షిండే. అంత ఖ‌రీదైన విగ్ర‌హాన్ని జాగ్ర‌త్త‌గా హైద‌రాబాద్ చేర్చే ప‌ని నాని, గోపీల‌కు ద‌క్క‌తుంది. వారు శిల్పాన్ని తీసుకుని హైదరాబాద్ వ‌స్తోన్న త‌రుణంలో శిల్పం మాయ‌మ‌వుతుంది. అక్కడే గంధ‌ర్వ రాజు కుమార్తె న‌క్ష‌త్ర‌(హెబ్బా ప‌టేల్) వీరిని క‌లుస్తుంది. మాన‌వులు, వారి అనుబంధాల‌ను చూడాల‌నే ఆస‌క్తితో భూలోకం చేరిన న‌క్ష‌త్ర‌కు నాని త‌న ఇంట్లో చోటిస్తాడు. కొంత మంది దుండ‌గులు నానిపై దాడి చేస్తున్న క్ర‌మంలో అనుకోనివిధంగా … న‌క్ష‌త్ర‌ లానే ఉన్న నందు అనే అమ్మాయికి సంబంధించిన వారు వారిని కాపాడతారు . అస‌లు నందు ఎవ‌రు? న‌క్ష‌త్ర కీ ఆమెకీ మ‌ధ్య సంబంధం ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే….
 
హీరో నాగ అన్వేష్ చేసిన ఈ రెండవ ప్రయత్నంలో నటుడిగా మంచి మార్కులే పొందాడు. దర్శకుడు బాహుబలి పళని ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ కథనే ఎంచుకున్నా… దానికి సరైన కథనాన్ని, ఆకట్టుకునే సన్నివేశాలని, కామెడీ ట్రాక్ ను జోడించ లేకపోవడం వలన మంచి ఫలితం రాలేదు. దర్శకుడు ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు . ఈ కథాంశం కొత్తది కానప్పటికీ బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది . హీరో, హీరోయిన్ల నటన, సప్తగిరి కామెడీ ట్రాక్, సినిమా క్లైమాక్స్, కొంత సీజీ వర్క్ ఆకట్టుకునే అంశాలు కాగా పేలవమైన కథనం, టేకింగ్ ఎఫెక్టివ్ గా లేకపోవడం నిరాశపరిచే అంశాలు. ద‌ర్శకుడు గ్రాఫిక్స్ విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకున్నాడు.అయితే అవి క్లైమాక్స్ వంటి కొన్నిచోట్ల బాగున్నాయి… కొన్నిచోట్ల పేలవం గా ఉన్నాయి . మొత్తం మీద ఈ ‘ఏంజెల్’ చిత్రం అక్కడక్కడా మాత్రమే మెప్పించింది … చాలా చోట్ల నిరుత్సాహపరిచింది.
 
క‌థానాయ‌కుడు నాగ అన్వేష్‌ మాస్ లుక్ కోసం బాగానే ట్రై చేశాడు. త‌న తొలి సినిమా కంటే ఇందులో పరిణితి చెందిన మంచి అభిన‌యాన్ని క‌న‌ప‌రిచాడు. డాన్సులు, ఫైట్లు బాగా చేసాడు . డైలాగ్ డెలివరీ లో మెరుగయ్యాడు . ఇక స‌ప్త‌గిరి … త‌న‌దైన కామెడీతో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.అయితే అతని హాస్యం కొన్ని సన్నివేశాల్లో మెప్పిస్తే, మరికొన్ని చోట్ల అతని అతి కామెడీ నొప్పించింది . ఇక టైటిల్ పాత్ర‌లో న‌టించిన హెబ్బా ప‌టేల్ త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఏంజెల్ అన్న పిలుపుకు తగినంత అందగత్తె కాకపోయినా, చాలా చోట్ల అందం గానే కనిపించింది . ప్ర‌దీప్ రావ‌త్‌, షాయాజీ షిండే, జ్యోతిష్యుడి పాత్ర‌లో న‌టించిన ర‌ఘుబాబు,సన ,సుమన్,అశోక్ కుమార్ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు . గ‌రుడ గెట‌ప్‌లో క‌బీర్‌ఖాన్ బాగా చేశారు. ఈ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు
 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాత ట్యూన్స్ అయినప్పటికీ చిత్రీకరణలో ఓకే అనిపిస్తాయి . నేపధ్య సంగీతం బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు – ధరణి