అక్టోబర్ 6న గోవాలో వీరి వివాహం !

ప్రేమ జంట నాగచైతన్య, సమంత… ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. వివాహం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే పెళ్లికి కొంత సమయం తీసుకున్న నాగచైతన్య, సమంతలు ఈలోపున తాము సైన్ చేసిన సినిమాలను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ ప్రేమ జంట వివాహం  అక్టోబర్ 6న గోవాలో ఘనంగా జరుగనుంది. అయితే అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ వివాహ వేడుకకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే నాగచైతన్య, సమంతల వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో జరుగనుండడం విశేషం. పెళ్లి తర్వాత ఈ జంట 40 రోజుల పాటు హానీమూన్ కోసం న్యూయార్క్‌కు వెళ్ళి అక్కడి అందమైన ప్రదేశాల్లో హానీమూన్‌ను  ఎంజాయ్ చేస్తారు.