నాగ చైతన్య, స‌మంత పెళ్లి రిసెప్షన్ ఎప్పుడంటే ?

ప్రేమ జంట నాగ చైతన్య- స‌మంత అక్టోబ‌ర్ 6న వివాహ బంధంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. గోవాలో జ‌ర‌గ‌నున్న వీరి పెళ్ళి వేడుక తొలి రోజు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం, రెండో రోజు క్రిస్టియ‌న్ సంప్రదాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు,స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. ప్రైవేట్ ఫంక్షన్ గా ఈ వివాహ వేడుక జ‌ర‌గ‌నుండ‌డంతో అభిమానుల కోసం హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్‌ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అక్టోబ‌ర్ 10న జ‌ర‌గనున్న రిసెప్ష‌న్ వేడుక‌కి సినీ సెల‌బ్రిటీల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్ కూడా హాజ‌రు కానున్నారు. ఈ భారీ ఈవెంట్‌కి సెల‌బ్రిటీలంద‌రిని నాగ్  స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నాడ‌ని టాక్. ఇక ఈ వేడుక‌ల త‌ర్వాత స‌మంత‌, చైతూ కొద్ది రోజులు హాలీడే ట్రిప్‌కి వెళ్ళ‌నున్నారు. అక్టోబ‌ర్ నెలాఖ‌రుకి తిరిగి స‌మంత‌-చైతూ హైద‌రాబాద్‌కి రానుండ‌గా న‌వంబ‌ర్‌లో వీరిద్ద‌రు ఎవ‌రి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ కానున్నారు. స‌మంత ప్ర‌స్తుతం తెలుగులో ‘రంగ‌స్థ‌లం 1985’, ‘రాజుగారి గ‌ది 2’, ‘మ‌హాన‌టి’ చిత్రాలు చేస్తుండ‌గా, నాగ చైతన్య మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.