నాలుగు భాషల్లో నాగార్జున

బహుభాషా చిత్రాలు ఎక్కువగా చేస్తున్న తెలుగు సినిమా హీరోల్లోప్రభాస్‌, నాగార్జున ముందున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ రెండు మూడు భాషల్లో చిత్రాలు చేయడంపైనే దృష్టిపెట్టాడు. నాగార్జునకూడా తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకున్నాడు. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలో తన చిత్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రస్తుతం నానితో కలసి తెలుగులో ‘దేవదాస్‌’ చేస్తున్నాడు. ఇందులో నాగ్‌ డాన్‌గానూ, నాని డాక్టర్‌గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌లతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నాడు.. అలాగే నానితో ‘దేవదాస్‌’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తమిళ్‌లో ధనుష్‌ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు తెలిసింది. మలయాళంలో మోహన్‌లాల్‌ చేయబోయే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట.
 
ప్రియదర్శన్‌ బయోపిక్‌ లో…
మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ అరేబియన్‌ సముద్రం నేపథ్యంలో సముద్ర అన్వేషకుడు నాల్గవ కుంజలి మక్కాల్‌ జీవితం ఆధారంగా ‘మక్కార్‌: ది లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌’ పేరుతో ఓ బయోపిక్‌ను రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో నాగార్జున నటించే అవకాశం ఉందట. ప్రియదర్శన్‌ ఇటీవలే నాగార్జునను కలిసి కథ నెరేట్‌ చేసినట్టు తెలుస్తోంది. 16వ శతాబ్దంలో కొచ్చి సముద్ర తీర ప్రాంతంలో భారత్‌ తరఫున నేవీ కమాండర్‌గా, నావికా అన్వేషకుడిగా నాల్గవ మక్కార్‌ పనిచేశారు. అంతేకాదు సముద్ర నావికుడిగా విశేష సేవలందించారు. పోర్చుగీస్‌ రాజు ఇండియాపై దాడి చేసిన టైమ్‌లో వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. ఆయన జ్ఞాపకార్థం కేరళలో స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బయోపిక్‌లో నాగార్జున ఏ పాత్రలో నటిస్తారనేది తెలియాల్సి ఉంది.