‘దేవదాసు’…అందరి ఆసక్తిని తనవైపు తిప్పుకుంటున్న క్రేజీ మల్టీస్టారర్ ‘దేవదాసు’. నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులతో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్టర్ గా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా ‘దేవదాసు’ షూటింగ్ అంతా పూర్తైంది. ఈ మధ్యే బ్యాంకాక్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆగస్ట్ మొదట్లోనే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సైనూద్దీన్ సినిమాటోగ్రఫర్. వైజయంతి సంస్థలో సి ధర్మరాజు సమర్పణలో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.
నటీనటులు:
నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, నరేష్ వికే, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య..
సాంకేతిక విభాగం:
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వినీదత్,సంస్థ: వైజయంతి మూవీస్
సినిమాటోగ్రఫర్: శ్యామ్ దత్ సైనూద్దీన్, సంగీతం: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్
Teaser Link: https://youtu.be/ xt5nRJ8E2H4