ఈ మల్టీస్టారర్ ఓ హిందీ సినిమాకు రీమేక్

తమ మూవీ రీమేక్ అనే విషయాన్ని దాచిపెట్టడం కంటే ముందుగానే చెప్పేయడం బెటర్ అని ఈ ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారట.ఇతర భాషా చిత్రం కథను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కథ తయారు చేసుకోవడం చాలా కాలం నుంచే జరుగుతోంది. అయితే గతంలో ఇలాంటి వాటిని బయటకు చెప్పేవాళ్లు కాదు, చాలా మంది ఫిల్మ్‌మేకర్స్. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. ప్రేక్షకులు బాగా స్మార్ట్ అయిపోయారు. దీంతో వివాదం ఎందుకని ఫిల్మ్‌మేకర్స్ అసలు విషయాన్ని చెప్పేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున-నాని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి దాదాపు సగ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రీమేక్ అని తెలిసింది. ఓ హిందీ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడట దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ విషయం ముందుగానే హీరోలు ఇద్దరికి కూడా తెలుసని అంటున్నారు.

అయితే బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందడంతో… తమ మూవీ రీమేక్ అనే విషయాన్ని దాచిపెట్టడం కంటే ముందుగానే చెప్పేయడం బెటర్ అని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారట. 2007లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జానీ గద్దార్’కు రీమేక్‌గా ఈ మల్టీస్టారర్ కథ సిద్ధమైందట. ఈ రీమేక్ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని అనుకున్నారట. ఈ చిత్రంలో నాగార్జునకు జంటగా ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నానీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.