స్టార్ స్టేటస్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు !

స్టార్ రేంజ్ కు చేరుకోవాలనుకుంటున్న హీరోలు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు. తన తనయుడికి మంచి కెరీర్ ను సంపాదించి స్టార్ స్టేటస్ అందించాలనుకుంటున్న నాగార్జున కూడా ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాడు. నాగచైతన్యకు స్టార్ స్టేటస్ తీసుకు వ‌చ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.  స్టార్ హీరో తనయుడైనా నిన్నటి వరకు నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ ఒడిదుడుకులతోనే సాగింది. ఒక సక్సెస్ వస్తే వెంటనే పరాజయాలూ ఎదురయ్యాయి.గత ఏడాది ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజయ్యాయి. వాటిలో ‘ప్రేమమ్’ హిట్టయినా,’ సాహసం శ్వాసగా’ మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా విజయం సాధించడం చైతూ కెరీర్ కు ఆక్సిజన్ లా పని చేసింది.

ఈ సినిమాను నాగ్ స్వయంగా తన సొంత బ్యానర్ పై తీశాడు. రారండోయ్ సినిమా విజయం తండ్రీ తనయులకు నూతనోత్సాహాన్నిచ్చింది. ఈ సమయంలోనే చైతూకు ఒక బ్లాక్ బస్టర్ పడాలనే ఉద్దేశంతో సక్సెస్ఫుల్   దర్శకుడు బోయపాటిని నాగ్ కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ తరువాత బోయపాటి ఫ్రీ అవుతాడు కనుక, చైతూకు ఓ ప్రాజెక్టు చేసిపెట్టమని నాగ్ బోయపాటిని కోరాడట.చైతూతో సినిమా చేయ‌డానికి నాగార్జున బోయపాటికి 12 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి బోయపాటి కూడా రెడీగానే ఉన్నాడని అనుకుంటున్నారు