అక్టోబర్ 13న నాగార్జున “రాజుగారి గది 2”

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ “రాజుగారి గది 2”. “క్షణం, ఘాజీ” లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నా “రాజుగారి గది 2” చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “‘రాజుగారి గది” సినిమా సూపర్ హీట్ అవ్వడంతో “రాజుగారి గది 2” కోసం ప్రేక్షకలోకమంతా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా “రాజుగారి గది 2” రూపొందుతుంది. నాగార్జున ఈ చిత్రంలో చాలా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా.. “క్షణం, ఘాజీ” చిత్రాల అనంతరం మా సంస్థల నుండి వస్తున్న సినిమా కావడంతో “రాజుగారి గది 2” ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా కొత్త ధోరణిలో చేయనున్నాం. “రాజుగారి గది” అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొంది, అందుకే “రాజుగారి గది 2″ని కూడా అక్టోబర్ నెలలో 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అదే స్థాయిలో “రాజుగారి గది 2″ కూడా ఘన విజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకం మాకుంది” అన్నారు.

ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: దివాకరన్, మ్యూజిక్‌: తమన్, ఆర్ట్‌: ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్‌: అబ్బూరి రవి, నిర్మాణం: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: ఓంకార్

Raju Gari Gadhi 2 Release On October 13
PVP Cinema and Matinee Entertainment’s jointly produced Raju Gari Gadhi 2 is releasing on October 13. After delivering highly acclaimed and successful films like Kshnam and Ghazi, the two prestigious banners have now wrapped up Raju Gari Gadhi 2 shooting with Nagarjuna, Samantha, Seerat Kapoor, Ashwin and Vennela Kishore in main leads, directed by Ohmkar.
“After the highly successful Raju Gari Gadhi, this Raju Gari Gadhi 2 is highly awaited as it has Nagarjuna playing very interesting role co-starring with Samantha. In view of the two production houses track record, RGG 2 is expected to be another commercially successful and acclaimed film mounted on good production values with high budgets involved.
We have got enough confidence on the product and are intending to promote the film very aggressively in view of the buzz created already.
Public anticipation is also very high in view of Raju Gari Gadi released in October last year being a runaway winner.  So, we have interestingly again decided to release the film on October 13 this year which can be a positive indication that this film too might turn out to be runaway hit,” producers said.
Artists:
Nagarjuna, Samantha, Seerat Kapoor, Ashwin, Naresh, Vennela Kishore, Praveen and others
Technicians:
Music: SS Thaman
Art: AS Prakash
Camera: Diwakaran
Dialogues: Abburi Ravi
Production: PVP Cinema, Matinee Entertainments
Direction: Ohmkar