దర్శకుడు దెబ్బతీసాడు …….`ఆఫీస‌ర్‌` చిత్ర సమీక్ష

                                               సినీవినోదం రేటింగ్ : 2/5  
ఎ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌ దర్శకత్వం లో ఈ రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
నారాయ‌ణ ప‌సారి ముంబైలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌. అండ‌ర్‌వ‌రల్డ్‌ను నామ‌రూపాలు లేకుండా చేసిన నారాయ‌ణ ప‌సారి ఓ ఫేక్ ఎన్‌కౌంట‌ర్ చేశాడ‌నే కేసు వేస్తారు కొంద‌రు. దాంతో హైకోర్టు ఆయ‌న‌పై ఓ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ టీమ్‌కు హైద‌రాబాద్‌కు చెందిన శివాజీరావ్‌(నాగార్జున‌)ను పైఅధికారిగా నియ‌మిస్తారు. ముంబై వ‌చ్చిన శివాజీ కేసును ప‌రిశోధించి ఓ సాక్ష్యాన్ని సేక‌రిస్తాడు. దాంతో నారాయ‌ణ ప‌సారిని అరెస్ట్ చేస్తారు కూడా. అయితే సాక్షిని ఎవ‌రో చంపేస్తారు. దాంతో నారాయ‌ణ ప‌సారి కేసు నుండి నిర్దోషిగా బ‌య‌ట‌కొస్తాడు. అదే స‌మ‌యంలో ఓ అండ‌ర్‌వ‌రల్డ్ టీంను క్రియేట్ చేసి న‌గ‌రంలో పేరు మోసిన వ్య‌క్తుల‌ను చంపించేస్తాడు. దాంతో ప్ర‌భుత్వం ఓ స్పెష‌ల్ ఎన్‌కౌంట‌ర్ టీమ్‌ను ఏర్పాటు చేసి దానికి నారాయ‌ణ‌ను చీఫ్‌ను చేస్తారు. నారాయ‌ణ తెలివిగా గేమ్ ఆడి శివాజీకి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ టీంకు సంబంధం ఉంద‌ని అంద‌రినీ న‌మ్మిస్తాడు. అప్పుడు శివాజీ ఏం చేస్తాడు? త‌న‌పై ప‌డ్డ నింద నుంచి ఎలా త‌ప్పించుకుంటాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి ….
 
‘శివ’ వంటి సినిమా త‌ర్వాత నాగ్‌, వ‌ర్మ సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో క‌చ్చితంగా కొన్ని అంచ‌నాలుంటాయి. చాలా కాలం తర్వాత వర్మ చేసిన సీరియస్‌ ప్రయత్నమే ఆఫీసర్‌. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న లైన్ ఆసక్తిగా ఉన్నా దాన్ని ఇంట్రస్టింగ్ గా మలచలేకపోయారాయన. సినిమా క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తీస్తానన్న వ‌ర్మ.. సినిమాను త‌నకు న‌చ్చిన గ్యాంగ్‌స్ట‌ర్స్ మూవీ త‌ర‌హాలోనే తెరకెక్కించాడు. సాధారణంగా పోలీస్‌-మాఫియా కథనాలతో సినిమాలు తీసే వర్మ.. ఈసారి డిపార్ట్‌మెంట్‌లో అధికారుల మధ్య ఘర్షణ, విచారణలాంటి కొత్త పాయింట్‌తో కథను రూపొందించుకున్నాడు. నారాయ‌ణ ప‌సారి అనే సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ సిస్ట‌మ్‌కు వ్య‌తిరేకంగా మారిపోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు చూపించ‌లేదు. ఓ పోలీస్ అండ‌ర్ వ‌రల్డ్ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ చేయ‌డం..మాఫియా, గొడ‌వ‌లు, ఎన్‌కౌంటర్స్ అన్నీ ఏదో ఒక రూపంలో వ‌ర్మ సినిమాల్లో చూసేసిన‌వే. . పోలీసాఫీసర్‌ అయిన విలన్‌.. మాఫియాతో చేతులు కలిపి హీరోపై పగ తీర్చుకోవాలని చేసే యత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. మిగతా పాత్రలను కూడా దర్శకుడు చాలా బలహీనంగా తీర్చి దిద్దాడు. డైలాగులు కూడా మెప్పించలేకపోయాయి. సెకండ్‌ హాఫ్‌లో కథ మరీ నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ముఖ్యంగా ఆర్జీవీ సినిమాల్లో ఉండే క్రైమ్ డ్రామా ఇందులో అస్సలు కనబడలేదు.
 
సినిమాకు మరొక పెద్ద డ్రాబ్యాక్ ప్రతినాయకుడి పాత్ర. ఆ పాత్ర బలహీనంగా ఉండటమేగాక, ఆందులో నటించిన నటుడు కూడ ఏ ఒక్క సన్నివేశంలోనూ నాగార్జునకు ధీటుగా నిలబడలేకపోయారు. ఆ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటుడ్ని తీసుకుని ఉంటే బాగుండేది.ఇక చివర్లో హీరో, విలన్ కి మధ్య ఫైట్ సీన్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.
 
సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నాగార్జున మెప్పించాడు. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తన నటనలో చూపించాడు. నాగార్జున వ‌య‌సు మీద ప‌డుతున్నా.. చాలా యంగ్ లుక్‌లో క‌న‌ప‌డ్డారు. శివాజీ రావ్ అనే క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌గా మెప్పించారు. నెగటివ్‌ రోల్‌తో ఫెరోజ్‌ అబ్బాసీ మెప్పించాడు. అవినీతి అధికారిగా పసారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌ మైరా స‌రీన్ సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేసింది. చిన్న పాత్రే. నటనపరంగా ఫర్వాలేదనిపించింది. ఇక షాయాజీ షిండే, నాగార్జున కూతురిగా న‌టించిన కావ్య‌, అజ‌య్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
సాంగ్స్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి శంకర్‌ నిరాశపరచగా.. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో బిస్వాస్‌ ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో సౌండ్‌ థ్రిల్‌ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎన్‌.భ‌ర‌త్‌వ్యాస్‌, రాహుల్ పెనుమ‌త్స‌ సినిమాటోగ్ర‌ఫీ ఓకే – రవళి