తండ్రీ కొడుకుల సినిమాల విడుదల ఇలా ….

ఆగస్టు నెలలో వరుసగా సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మళ్లీ సెప్టెంబర్ వస్తే పెద్ద సినిమాల తాకిడి ఉంటుంది. అక్టోబర్‌లో దీపావళి తప్పిస్తే మళ్లీ సినిమాలకు డల్ సీజన్ మొదలవుతుంది. అందుకే ఆగస్టు నెల బిజీ బిజీగా మారింది. అయితే  హీరో నాగార్జునకు సంబంధించి రెండు సినిమాలు ఆగస్టులో రావాల్సి ఉంది. ఒకటి తన కొడుకు హీరోగా… సాయికొర్రపాటి కొత్త దర్శకుడితో తెరకెక్కించిన ‘యుద్ధం శరణం’ .  రెండవది …తను హీరోగా నటించిన ‘రాజుగారి గది-2’.

ఈ రెండు సినిమాలు దాదాపు చివరి దశలో ఉన్నాయి. వీటి రిలీజ్‌కు కనీసం ఓ వారం రోజులన్నా గ్యాప్ ఉండేలా చూడాలి. అయితే ఈ సినిమాల విడుదలకు ఆగస్టు మూడవ, నాలుగవ వారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆగస్టు 25న నాగచైతన్య సినిమా విడుదలకు ఆలోచిస్తున్నారని తెలిసింది. అలా అయితే నాగార్జున ‘రాజుగారి గది-2’ చిత్రం సెప్టెంబర్‌లో లేదా దీపావళికి వెళ్ళాలి . ఇదిలా ఉండగా నాగార్జున నిర్మాతగా రాజ్‌తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా కూడా దాదాపుగా పూర్తికావచ్చింది. దానికి కూడా రిలీజ్ డేట్ చూసుకోవాలి. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాతే రాజ్‌తరుణ్ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.