నాగార్జున భిన్న‌మైన పాత్ర‌లో ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్‌

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి అక్కినేని నాగార్జున హీరోగా నిర్మిస్తోన్న‌ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 70 శాతం స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అహిషోర్ సోల్మ‌న్ దర్శకుడు.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా  ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ సైతం అలాగే ఆగింది. నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహంతో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ.. ఫిల్మ్ యూనిట్‌ ‘వైల్డ్ డాగ్’ చిత్రీక‌ర‌ణ‌ను పునఃప్రారంభించింది. దాని ప్ర‌కారం నాగార్జున స‌హా సెట్స్‌లోకి అంద‌రూ డిసిన్‌ఫెక్టెడ్ ట‌న్నెల్ నుంచే వెళ్తున్నారు.  సేఫ్టీ మెజ‌ర్స్ విష‌యంలో ఎక్క‌డా ఏ మాత్ర‌మూ రాజీ ప‌డ‌కుండా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సైతం యూనిట్ రిలీజ్ చేసింది. నాగార్జున లాంటి స్టార్ షూటింగ్ పునఃప్రారంభించ‌డంతో చిత్ర పరిశ్ర‌మ‌తో పాటు దిన‌స‌రి వేత‌నంతో జీవితాన్ని సాగించే కార్మికులు.. ఇది మిగ‌తా సినిమాల యూనిట్‌ల‌కు కూడా స్ఫూర్తినిస్తుంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇందులో విజ‌య్ వ‌ర్మ అనే ఎన్ఐఏ ఆఫీస‌ర్ రోల్‌ను నాగార్జున చేస్తున్నారు. నేర‌స్తుల‌తో వ్య‌వ‌హ‌రించే అత్యంత క‌ఠిన‌మైన తీరుతో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు.’వైల్డ్ డాగ్’ బృందంలో  అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ – రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్ (ఫీల్డ్ ఏజెంట్ – ఎన్ఐఏ) స‌భ్యులు. దియా మీర్జా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో స‌యామీ ఖేర్ ఒక కీల‌క పాత్ర‌లో చేస్తున్నారు.

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్,‌ఎడిటింగ్‌ శ‌్రావ‌ణ్ క‌టిక‌నేని, ఆర్ట్‌ ముర‌ళి ఎస్‌.వి, యాక్ష‌న్‌ డేవిడ్ ఇస్మ‌లోన్‌, స‌హ నిర్మాత‌లు: ఎన్‌.ఎం. పాషా, జ‌గ‌న్ మోహ‌న్ వంచా