దీపావళి కి నాగశౌర్య, సాయిపల్లవి ‘కణం’

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో నాగశౌర్య, ‘ఫిదా’ ఫేం సాయిపల్లవి జంటగా విజయ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కణం’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేస్తోంది. ‘2.0’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.
నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.