‘ప్రతిక్షణం’ ప్రీ రిలీజ్‌ వేడుక !

శ్రీ భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్‌ పతాకంపై జి.మల్లిఖార్జునరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రతిక్షణం’. నాగేంద్రప్రసాద్‌ దర్శకుడు. మనీష్‌బాబు, తేజశ్విని హీరోహీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థ డైరెక్టర్‌ అమృతరావు, పద్మిని, లయన్‌ సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత జి.మల్లిఖార్జునరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ దేవారెడ్డి, ఓంనాథ్‌రెడ్డి, రఘురామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత జి.మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ – ”ప్రతిక్షణం సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. సినిమాను ఆగస్టు 18న విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ”క్యాచీ టైటిల్‌. క్షణం సినిమా ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాత మల్లిఖార్జునరెడ్డి, టీమ్‌కు అభినందనలు” అన్నారు.

అమృతరావు మాట్లాడుతూ – ”’ప్రతిక్షణం’ సినిమా ట్రైలర్‌సాంగ్స్‌ బావున్నాయి. సినిమా పెద్ద హిట్‌ సాధించి దర్శకుడు, నిర్మాత, యూనిట్‌కు మంచి పేరు తేవాలని కోరుకంటున్నాను” అన్నారు.

సాయివెంకట్‌ మాట్లాడుతూ – ”ఆగస్టు 18న విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులు నచ్చుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్‌, సాంగ్స్‌ బావున్నాయి. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – ”పాటలు, ట్రైలర్‌ చూస్తుంటే నిర్మాతగారు ఎంత ప్యాషన్‌తో సినిమా చేశారో అర్థం అవుతుంది. సినిమా మంచి సక్సెస్‌ అవుతుంది. సినిమాను ఆగస్టు 18న 80-100 థియేటర్స్‌లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం” అన్నారు.

మనీష్‌బాబు, తేజస్విని, అర్చన, విజయసాయి, వైవా హర్ష, సుదర్శన్‌రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రఘురాం, ఛాయాగ్రహణం: కళ్యాణ్‌సమీ, ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, ఆర్ట్‌: రవిచంద్ర, నిర్మాత: జి.మల్లిఖార్జునరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నాగేంద్రప్రసాద్‌.