‘కేన్సర్ ని జయించిన’ వారి ర్యాలీలో బాలయ్య !

కేన్సర్‌ మీద ‘సింహ గర్జన’ చేయడానికి రెడీ  అయ్యాడు నటసింహం నందమూరి బాలయ్య.అక్టోబర్ 28న వైజాగ్ వేెదికగా ఓ భారీ  ర్యాలి జరగనుంది. ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన ‘లైఫ్ ఎగైన్ పౌండేషన్’ ద్వారా కేన్సర్ మీద ఎవెర్ నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ ని ఏర్పాటు చేసింది ఆ టీం.ఈ ప్రోగామ్ లో బాలకృష్ణతో పాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత , మరికొందరు  టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని కేన్సర్ మీద అవగాహన కల్పించనున్నారు.

 విశాఖ పట్నం  ప్రాంతానికే చెందిన  గౌతమి నటిగా మారి దక్షిణాది భాషలన్నింట్లో చిత్రాలు  చేసి మంచిపేరు సంపాయించుకుంది . ఆ తరువాతి కాలం లో ఆమె కేన్సర్ బారిన పడింది . అయినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చికిత్స పొంది కేన్సర్ ని  జయించింది . ఆ తరువాత  ‘లైఫ్ ఎగైన్ పౌండేషన్’ ద్వారా గౌతమి కేన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమం చేపట్టింది . ఇటీవల కొంతకాలం ప్రముఖ నటుడు కమలహాసన్ తో సహజీవనం చేసిన గౌతమి  ఇప్పుడు అతనినుండి విడిపోయింది. త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆమె  బీజేపీ తో సన్నిహితం గా ఉంటోంది .