`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌… 8న విడుద‌ల !

శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మిస్తోన్న చిత్రం `బెస్ట్ ల‌వ‌ర్స్`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. అలాగే సినిమా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో శ్రీక‌ర‌ణ్ మాట్లాడుతూ, `సోష‌ల్ మీడియా నేప‌థ్యంలో సాగే అంద‌మైన ల‌వ్ స్టోరీ ఇది. ఒక‌ర్ని ఒక‌రు  చూసుకోకుండానే ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ‌ను ఓ స‌స్పెన్స్ గా థ్రిల్లింగ్ అంశాల‌తో చిత్రీక‌రించాం. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ప్రేమించ‌లేని దాడులు జ‌రుగుతోన్న రోజులివి. కానీ నిజ‌మైన ప్రేమ అనేది ఎప్ప‌టికీ ప‌దిల‌మే. దాన్ని హీరో ఎలా సాధించాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సినిమా బాగా వ‌చ్చింది. పాట‌లు, ట్రైల‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ గొంటి మాట్లాడుతూ, ` విజ‌య‌వాడ అమ్మాయి-హైద‌రాబాద్ అబ్బాయి మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన క‌థ‌ను సినిమాగా చేస్తున్నాం. ఫేస్ బుక్ లో పరిచ‌య‌మైన  ఆ ప్రేమ ఎలా సాగింది? ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింది? అన్న అంశాలు హైలైట్ గా ఉంటాయి. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాటిక్ గా మ‌లిచి చేసాం. నేను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీయ‌గ‌లిగాను. ఈనెల 8న సినిమా రిలీజ్ అవుతుంది.  త‌ప్ప‌కుండా అందిరకీ న‌చ్చుతుంది` అని అన్నారు.
చిత్ర నిర్మాత శ్రీకాంత్ గొంటి మాట్లాడుతూ, ` చాలా రోజుల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీల్ దొరికే ల‌వ్ స్టోరీ చేసాన‌ని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీక‌రించారు. మంచి టెక్నీక‌ల్ టీమ్, న‌టీన‌టులు దొర‌ర‌క‌డంతో సినిమా బాగా వ‌చ్చింది. ఈనెల 8న రిలీజ్ చేస్తున్నాం. అంతా ఆద‌రిస్తార‌ని ఆశిస్తు`న్నా అని అన్నారు.
తుమ్మ‌ల‌ప‌ల్లి రామస‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ` టైటిల్ చాలా క్యాచీగా ఉంది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కు సినిమా బాగా క‌నెక్ట్ అవుతుది.  శ్రీక‌ర‌ణ్ చక్క‌గా న‌టించాడు. ఫైట్ లు, పాట‌ల్లో ఇర‌గ‌దీసాడ‌నిపిస్తుంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి. నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి` అని అన్నారు.
అట్లూరి  రామ‌కృష్ణ మాట్లాడుతూ, ` తెలంగాణ రాష్ర్టంలో సినీ ప‌రిశ్ర‌మ బాగా అభివృద్ధి చెంతుంది.  ఇటీవ‌ల వ‌చ్చిన  చిన్న  సినిమాలు  చ‌క్క‌ని  విజ‌యాలు సాధిస్తున్నాయి. ఆ కోవ‌లోనే `బెస్ట్ ల‌వ‌ర్స్` కూడా నిలుస్తుంది. అలాగే చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు విష‌యంలో అంతా స‌హ‌క‌రించాలి. అప్పుడే మంచి సినిమాలు తీయ‌డానికి ఆస్కారం ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స‌హ‌కారం చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నాను` అని అన్నారు.
సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ` ఆడియో కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క‌థ వింటుంటే ప్ర‌యోగాత్మ‌క సినిమాలా ఉంది. మంచి సబ్జెక్ట్. ఇలాంటి సినిమాల‌కు అవార్డులు రావాలి` అని అన్నారు.  ఈ వేడుక‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయి కిర‌ణ్‌,  అలీబాబు, విక్ర‌మ్ గొంటి త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం:  డి. యాద‌గిరి, సంగీతం:  సాయికిర‌ణ్‌, పాట‌లు: ప‌్ర‌శాంత్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జ‌యంత్, కొరియోగ్ర‌ఫీ: న‌ందు జెన్న‌, స్టోరీ, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌ంది వెంక‌ట రెడ్డి, నిర్మాత‌:  శ్రీకాంత్ గొంటి.