క్వాలిటీ స్టోరీతో ‘కన్నుల్లో నీ రూపమే’

ఏ. ఎస్. పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే..’నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ  మా చిత్రాన్ని జూన్29న  విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని, డైరెక్టర్ బిక్స్ ఇరుసడ్ల , ఇప్పిలి రామ్మోహన్ రావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని మాట్లాడుతూ.. మా “కన్నుల్లో నీ రూపమే” విడుదలైన ఆడియో మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.మా చిత్రాన్ని హరిహర చలనచిత్ర, శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్ రావు గార్లు సినిమా చూసిన తరువాత ‘ఈ చిత్రాన్ని మా హరిహర చలన చిత్ర లో విడుదల చేద్దాము’ అని  మాకు ధైర్యాన్నిచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారికి, ఇప్పిలి రామ్మోహన్ రావు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం.
హరిహర చలనచిత్ర నిర్మాత ఇప్పిలి రామ్మోహన్ రావు మాట్లాడుతూ
నేను మా శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని చూడటం జరిగింది,చూసిన వెంటనే ఈ చిత్రానికి చిరు  సాయం చేయాలని నిర్ణయించుకున్నాము, ఈ సినిమా చాలా క్వాలిటీ తో స్టోరీకి తగ్గట్టు ఎక్కడ కంప్రమైజ్  కాకుండా తీసారు. సాకేత్అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి చాలా ప్లస్ అవుతుంది బిక్స్ గారు తనకిది మొదటి చిత్రమే అయినా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు.. అని చెప్పారు 
దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ…ఈ చిత్రం అందరికి నచ్చే సినిమా అవుతుంది కొత్త దర్శకుడిని అని ఎవరు అనుకోకుండా అందరూ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా తేజస్విని ప్రకాష్, నందు ల సపోర్ట్ కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు హరిహర చలనచిత్ర  శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్ రావు గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, వాళ్ళగురించి చాలా పోసిటివ్ గా విన్నాను ఇప్పుడు చూస్తున్నాను. వీళ్ళతో రిలీజ్ చేయడం హ్యాపీ గా ఉంది అని తెలిపారు. 
సంగీతం  : సాకేత్ కోమండురి,కెమెరా:  విశ్వకాంత్ , సుభాష్ దొంతి,
కొరియోగ్రాఫర్: ఆట సందీప్,పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి కాసర్ల శ్యామ్, 
పి. అర్. ఓ. కడలి రాంబాబు,సమర్పణ: రాజమౌళి .ఇ
 
అసోసియేట్ :హరిహర చలన చిత్ర, నిర్మాత: భాస్కర్ భాసాని
కథ స్క్రిన్ ప్లే మాటలు దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల