విశ్వ‌క్ సేన్ `హిట్` చిత్రం నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్రారంభం

‘నేచుర‌ల్ స్టార్’ నాని కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో భాగంగా ‘వాల్‌పోస్ట‌ర్ సినిమా’ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ అయ్యారు . గురువారంనాడు హైద‌రాబాద్‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా ప్రొడ‌క్ష‌న్ నెం.2గా కొత్త చిత్రం `హిట్‌` పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా విడుద‌లైన `ఫ‌ల‌క్‌నుమాదాస్‌`తో హీరోగా పరిచయం చేసుకున్నవిశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.