ఏప్రిల్ 12న నాని `కృష్ణార్జున‌యుద్ధం` విడుదల

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’ నుండి రీసెంట్‌గా విడుద‌లైన `ఎంసీఏ` వ‌ర‌కు ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న ‘నేచర‌ల్ స్టార్’ నాని హీరోగా ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక  గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇందులో  కీల‌క‌మైన స‌న్నివేశాలను  చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
Nani’s ‘Krishnarjuna Yuddham’  Grand Release On April 12
`Krishnarjuna Yuddham` is the latest movie of Natural Star Nani who accomplished eight consecutive hits starting from ‘Yevade Subrahmanyam’ to recently released ‘MCA’. Nani will be seen in dual roles in `Krishnarjuna Yuddham` is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner, while Venkat Boyanapalli is the presenter. Anupama Parameswaran & Rukshar Mir are the leading ladies opposite Nani.
‘Venkatadri Express’ and ‘Express Raja’ fame director Merlapaka Gandhi is directing the film. So far, the film is done with two shooting schedules. Currently, final schedule is being shot. The production unit is canning few crucial scenes on lead cast in the schedule. With the ongoing schedule, entire production work will be wrapped up.
After completing all the post-production works, the movie will hit the screens on April 12, 2018. Hiphop Tamizha is providing music for the film, whereas Karthik Ghatmananini is handling cinematography.