‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌’

‘1940లో ఓ గ్రామం’ చిత్రంతో జాతీయ అవార్డు పొందిన నరసింహ నంది రూపొందించిన తాజా సినిమా ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌’. ‘జబర్‌దస్త్‌’ అభి, సందీప్తి, వరుణ్‌, ఫణి ప్రధాన పాత్రదారులు. శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతి రెడ్డి సమర్పణలో రూపొందింది.  సుక్కు సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీని సీనియర్ డైరెక్టర్ సాగర్ ఆవిష్కరించారు.

దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ ‘ఇదొక విభిన్న తరహా చిత్రం. దేశంలో సగానికిపైగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కొన్ని లక్షలమందికి గేదె, ఇతర పాల ఉత్పత్తుల వ్యాపారమే జీవనాధారం. అంత ప్రాధాన్యమున్న ఆ గేదెను ఎం.ఎల్‌.ఎ. తనయుడు యాక్సిడెంట్‌ ద్వారా హత్య చేస్తాడు. జీవనాధారం కోల్పోయిన యజమాని న్యాయం కోసం పోరాడతారు. ఆయనకు రైతులు అండగా నిలుస్తారు. ఈ చిత్రాన్ని జులై మొదటి వారంలో విడుదల చేయనున్నాం’ అని తెలిపారు. తోటి జీవరాశుల్ని కాపాడుకోవడం మన కనీస ధర్మమని, ఈ సినిమా ద్వారా జంతు సంరక్షణ ఆవశ్యకతను తెలిపానని దర్శకుడు నరసింహనంది అన్నారు. ప్రేక్షకులు కొనే ప్రతి టిక్కెట్ నుండీ ఒక రూపాయిని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందిస్తామని నరసింహ నంది చెప్పారు.గీత రచయిత డా.చల్లా భాగ్యలక్ష్మి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ చిత్రానికి కెమెరా : మోహన్‌రెడ్డి, సంగీతం : సుక్కు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : కొలకలూరి రవిబాబు, వద్దల హరిబాబు, రఫీ.