‘మళ్లీ వచ్చిందా’ ఫస్ట్‌ లుక్‌ విడుదల !

సి.వి.ఫిలింస్‌ పతాకంపై కిరణ్‌, దివ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్లీ వచ్చిందా’. కె.నరేంద్రబాబు దర్శకుడు. వెంకటేష్.సి నిర్మాత. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సస్పెన్స థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంది. ఈ మధ్యకాలంలో కూడా ‘గంగ’, ‘రాజుగారి గది’, ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాలను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది కూడా ఆ తరహా కథే. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది’’ అని అన్నారు.

దర్శకుడు నరేంద్రబాబు మాట్లాడుతూ ‘‘దెయ్యానికి పగలు, రాత్రి అని ఏమీ ఉండదు. మనిషి నుంచి మనిషికి వెళ్లగలదు. ఇప్పటి వరకూ ఇలాంటి కథలు చాలా చూశాం. ఓ దెయ్యం ఫొన నుంచి ఫోనకి కూడా వెళ్లి మనుషుల్ని భయపెట్టగలదని తెలిపే సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంగా సాగుతుంది. కథ వినగానే నిర్మాతలకు నచ్చి షూటింగ్‌ మొదలుపెట్టారు. హైదరాబాద్‌, బెంగుళూరు, మున్నార్‌ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. కన్నడలో ఏడు సినిమాలు తీస్తే అందులో నాలుగు సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. తెలుగులో మంచి దర్శకుడిగా స్థిరపడాలని తొలి ప్రయత్నం చేశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా’’ అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘హారర్‌ కథకు యాప్ట్‌ అయినా టైటిల్‌ ఇది. పూర్ణ.కె కెమెరా పనితనం సినిమాకు ప్లస్‌ అవుతుంది. గిరిధర్‌ దివాన అద్భుతమైన బాణీలు అందించారు. సెన్సార్‌ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణ, హీరో కిరణ్‌, హీరోయిన్  దివ్యరావు తదితరులు పాల్గొన్నారు.