డిసెంబ‌ర్ 21న నాని, దిల్‌రాజు ల `ఎం.సిఎ`

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా `ఎం.సి.ఎ`. దిల్‌రాజు `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందుతోంది. రెండు పాటలు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సినిమాను డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రూపొందిన శ‌త‌మానంభ‌వ‌తి, నేను లోక‌ల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, ఫిదా, రాజా ది గ్రేట్  చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ సాధించాం. డ‌బుల్ హ్యాట్రిక్ సాధించ‌డానికి ఎం.సి.ఎతో సిద్ధ‌మ‌వుతున్నాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అల్రెడి డబుల్ హ్యాట్స్ సాధించిన హీరో నాని ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్‌కు నాంది ప‌లుకుతాడన‌డంలో సందేహం లేదు. ఈ ఏడాదినే `నేను లోక‌ల్‌`తో నాని మా బ్యాన‌ర్‌లో హిట్ కొట్టాడు. `ఎం.సి.ఎ` దీన్ని మించే హిట్ అవుతుంది. మా బ్యాన‌ర్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన మూవీ `ఫిదా`లో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.  త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచుతూ మాకు డ‌బుల్ హ్యాట్రిక్‌ను తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంది కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. `నేను లోక‌ల్` చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు. అందుకు సాక్ష్య‌మే ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ ట్రాక్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు.  విజ‌యాలు సాధిస్తున్న నానికి ఈ `ఎంసీఏ` చిత్రం మ‌రో మెట్టుకానుంది. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ రెండు పాట‌ల‌ను స్పెయిన్‌లో చిత్రీక‌రిస్తాం. నాలుగు రోజుల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేస్తాం. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌,  క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.