15 న నవీన్ చంద్ర, నివేథ థామస్ ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’

నవీన్ చంద్ర, నివేథ థామస్ జంటగా నటిస్తున్న సినిమా ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రఘు బాబు చౌదరి మరియు కే.బి చౌదరి లు సంయుక్తంగా నిర్మిస్తుండగా సుకుమార్ దగ్గర పలు సినిమాలు అసోసియేట్ గా పని చేసిన అజయ్ వోదిరాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఫస్ట్ లుక్, టిజర్, తోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ఈ సినిమా ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకొని అన్ని హంగులతో డిసెంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా భారి ఏత్తున విడుదలకు సిద్దంగా ఉంది. 

ఇప్పటికే మ్యూజికల్ గా కూడా భారీ హిట్ అందుకున్న ఈ సినిమా పై అభిమానుల్లోనూ మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆలీ అభిమన్యు సింగ్, తాగుబోతు రమేష్, జీవా, సుప్రీత్, గిరి, దేవన్, శ్రవణ్, రోహిణి వంటి భారి తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మించిన ఈ సినిమాకు సంగీతం మలయాళం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్  రతీష్ వేగ, కెమెరా గిరీష్ గంగాధరన్ మరియు ఆథర్ విల్సన్, ఏడిటింగ్ ఏస్.బి ఉద్భవ్, ఆర్ట్ రాజీవ్ నాయర్, దర్శకత్వం అజయ్ వోదిరాల.

వరుస హిట్ల తో మంచి ఫాం లో ఉన్న నివేథ థామస్ నటన్ మరియు తన క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. డిసెంబర్ 15 న విడుదల.