‘నవ్యాంద్ర ప్రదేశ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టరీ 2019’ ఆవిష్కరణ !

ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో ‘నోవాటెల్ వరుణ్’ ఫైవ్ స్టార్ హోటల్ లో ఫిబ్రవరి1 న “నవ్యాంద్ర ప్రదేశ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టరీ2019” ని రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌ. దేవినేని ఉమామహేశ్వరరావు , ఏ.పి.యఫ్.డి.సి.ఛైర్మన్ గౌ. అంబికా కృష్ణ చేతుల మీదుగా “నవ్యాంద్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్” ఛైర్మన్ యస్.వి.యన్.రావు ఆవిష్కరించారు. సెలబ్రిటీస్ జ్యోతి,మయూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రొడ్యూసర్, యన్ఆరై కోటేశ్వరరావు ,ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ ప్రెసిడెంట్ పి. రమేష్ వర్మ ,ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.వి.సాంబశివరావు ,ఆర్టిస్టు యూనియన్ ప్రెసిడెంట్ టి.వెంకటేశ్వర్లు(వాసు),ఫైట్ మాస్టర్ యన్.నాగరాజు ,ప్రొడక్షన్ మేనేజర్ ఈ సి మెంబర్ టి.భోగేశ్వరరావు, పి.ఆర్.ఓ.సాంబశివరావు ,కే.వేణుగోపాల్ పాల్గొన్నారు