మూడో ప్రియుడికి భారీ కానుక !

నయనతార.. ఇప్పుడు ఈ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్స్ లా జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్‌. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన దక్షిణాది టాప్ హీరోయిన్‌ ఇప్పుడు నయనతార.

ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం ‘మాయ’ అనూహ్య విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత నటించిన ‘డోరా’ నిరాశపరిచింది. అయినా ఈ స్టార్‌ నటి మార్కెట్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు ‘అరమ్’, ‘ఇమైకా నోడిగళ్’, ‘కొలైయుదీర్‌ కాలం’, ‘నేర్‌వళి’ చిత్రాలతో పాటు తాజాగా అంగీకరించిన ‘ఖోఖో’ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన ‘వేలైక్కారన్‌’ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది

ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు విఫలమైన ఆమె ముచ్చటగా మూడోసారి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం చాలాకాలంగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమ ఆయనతో సహజీవనం సాగించే స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ విషయం గురించి ఇద్దరూ మౌనం వహిస్తున్నా, వీరి మధ్య ప్రేమ కొనసాగుతోందనడానికి చాలా సాక్ష్యాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడికి అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా కొనిచ్చారట. ఇప్పుడీ విషయమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది….