నయనతార అంతే… షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌కి సినిమా !

దర్శకుడిగా తనని తాను ఫ్రూవ్ చేసుకునే అవకాశాన్ని షార్ట్ ఫిల్మ్స్ యంగ్ టాలెంట్‌కి కల్పిస్తున్నాయి.పాతరోజుల్లో దర్శకుడు అవ్వాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎక్కడ చేశావ్ ?…అంటూ అనుభవాన్నిఆరాతీసిన తర్వాతే డైరెక్టర్‌ ఛాన్స్ ఇస్తున్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయకుండా కూడా దర్శకుడిగా తనని తాను ఫ్రూవ్ చేసుకుని అవకాశంని యంగ్ టాలెంట్‌కి కల్పిస్తున్నాయి షార్ట్ ఫిల్మ్స్. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి కంటిలో పడితే చాలు దశ తిరిగినట్లే. ఇందుకు టాలీవుడ్‌లో అనేక ఉదాహరణలు చూపించవచ్చు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి షాకింగ్ ఆఫర్ ఇచ్చింది నయనతార….
తమిళ షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సర్జున్ కె.ఎమ్ చేసిన ‘లక్ష్మి’ అనే షార్ట్ ఫిల్మ్ ఆమధ్య ‘టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ’ అయింది. తాజాగా ఆయన చేసిన మరొక షార్ట్ ఫిల్మ్ ‘మా’ సంచలన విజయాన్ని అందుకుని, 2.8 మిలియన్ల వ్యూస్‌తో కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. విమర్శకులు, సినీ పెద్దలు మెచ్చుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌కి హీరోయిన్ నయనతార ఏకంగా సినిమా అవకాశంతో బంపర్ ఆఫర్ ఇచ్చింది. నయనతారతో అతి త్వరలో సర్జున్ కె.ఎమ్.. హర్రర్ కంటెంట్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కె.జె.ఆర్ స్టూడియోస్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో మొదలుకానుంది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా నయనతార అంతే.. ‘ఆమెకి ఏదైనా నచ్చితే అలాగే అవకాశాలు ఇచ్చేస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.