బాయ్ ఫ్రెండ్ బర్త్ డే … ఎంజాయ్ చేస్తున్నాం !

దక్షిణాది అగ్రహీరోయిన్ న‌య‌నతార శింబు , ప్రభు దేవా తర్వాత  నూతన  దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది … ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటూ  డేటింగ్ చేస్తున్నారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయినా ఆ జంట మాత్రం ఇంకా ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు. కానీ బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్‌తో న్యూయార్క్‌లో ఉన్న‌ట్లు న‌య‌న‌తారా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో వాళ్ల ఇద్ద‌రి మ‌ధ్య చాలా క్లోజ్ రిలేష‌న్‌షిప్ ఉన్న‌ట్లు బహిరంగం గా ఒప్పుకున్నట్లయ్యింది. “ఇవాళ డైర‌క్ట‌ర్ విఘ్నేశ్ బ‌ర్త్‌డే. అందుకే ఈ సందర్భంగా ఎంజాయ్ చేస్తు”న్న‌ట్లు న‌య‌న‌తార త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇటీవ‌ల న‌య‌న‌తార గురించి డైర‌క్ట‌ర్ విఘ్నేశ్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. న‌య‌న‌తో త‌న‌కు ఉన్న స్పెష‌ల్ రిలేష‌న్ గురించి చెప్పాడు. న‌య‌న‌తార గురించి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చెప్ప‌లేన‌ని, అలాంటి అంశాల‌ను చెప్పేందుకు త‌న‌కు ఇబ్బందిగా ఉంటుంద‌న్నాడు. కానీ ఈ ఇద్ద‌రి ఈ లేటెస్ట్ ఫోటో మాత్రం వారి మధ్య ఉన్న రిలేష‌న్ ను చెప్పకనే చెప్పింది ……