చిరంజీవి సరసన నయన తార ఓకే !

‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలో చిరంజీవి కి హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి చిత్ర యూనిట్‌ నానా ఇబ్బంది పడింది. చాలా మందినే సంప్రదించింది. అప్పట్లో అనుష్క, నయన తార, దీపికా పదుకొనే వంటి అగ్ర కథానాయికలను ఆ సినిమాలో చేయించేందుకు చర్చలు జరిపారు. కానీ ఎవరికీ వీలుకాక అంగీకరించలేదు. చివరకు కాజల్‌ను ఎంపిక చేశారు. సినిమా హిట్‌ కావడంతో కాజల్‌కు కలిసొచ్చిందనుకోండి.

ఇప్పుడు చిరంజీవి చేయబోయే మరో చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ151వ సినిమా తెరకెక్కబోతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. కథ రెడీ అయిపోయినా చిరంజీవి సరసన నటించే కథానాయిక ఎంపిక కోసమే ఎక్కువ సమయం పట్టేసింది. ఇప్పుడూ చాలా మంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా నయన తారను ఓకే చేశారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.