మొదటిసారి ఓ కొత్త నయనతారని చూస్తారు !

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో నయనతార మంచి ఉదాహరణగా నిలుస్తున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓ పక్క కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా  మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషిస్తూ తనకంటూ  ఓ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. స్టార్‌ హీరోలకు దీటుగా  స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నయనతార తాజాగా  మరో మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించేందుకు  గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తమిళంలోప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  లైకా ప్రొడక్షన్‌లో రూపొందే ‘కోకో’ చిత్రంలో నటించనున్నారు.

ఈ చిత్రాన్ని ఇటీవల చెన్నైలో  చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ లాంచ్‌ చేసింది.
నెల్సన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో నయనతార పాత్ర తీరుతెన్నులు చాలా శక్తివంతంగా ఉంటాయట. అంతేకాదు సరికొత్తగా ఉంటుందని, మొదటిసారి ఓ కొత్త నయనతారని ఈ చిత్రం ద్వారా చూడనున్నారని చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ 102వ చిత్రంలో, చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’తోపాటు తమిళంలో ‘ఇమైక్కా నోడిగల్‌’, ‘కోలైయుథిర్‌ కాలమ్‌’, ‘అరామ్మ్‌’, ‘వెలైక్కరన్‌’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.