శుభఘడియలు దగ్గర పడుతున్నాయా?

నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌… పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోలేదు కానీ వీలు చిక్కినప్పుడల్లా ప్రేమపక్షుల మాదిరి విహరిస్తున్నారు. అవసరమనుకుంటే ఫారిన్‌ ట్రిప్‌కి కూడా వెళ్తున్నారు. మొన్నా మధ్య అమెరికాలో ఈ ఇద్దరూ సందడి చేశారు. తాజాగా అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కి వెళ్లి కొంత సమయాన్ని గడిపారు నయన్‌ – విఘ్నేష్‌.  నయనతార ఎప్పుడు అమృత్‌సర్‌ వెళ్లినా ఒంటరిగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు జంటగా వెళ్లడం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌.
 
అంటే వీరి పెళ్లికి శుభఘడియలు దగ్గర పడుతున్నాయా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇద్దరూ అక్కడ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో వాటిల్లో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే… తమిళంలో అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’, తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలు కాకుండా మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్‌తో ఎప్పటిలాగానే ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్‌.
స్టార్‌ నటులకు దీటుగా నిలిచింది
అంచెలంచెలుగా ఎదుగుతూ నటనలో పరిణతి పొందుతూ నయనతార స్టార్‌ హీరోయిన్‌ అంతస్తును అందుకున్నారు.  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల కథానాయకి అంతస్తుకు చేరుకుంది. అలా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం రూ.4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక దక్షిణాది కథానాయకిగా రికార్డుకెక్కింది.
సాధారణంగా రజనీకాంత్, విజయ్, అజిత్‌ వంటి స్టార్స్‌ చిత్రాల విడుదల కోసమే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు.స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకునే విడుదల సమయంలో వేకువజామునే చిత్రాల షో లు వేస్తుంటారు. నయనతార నటించిన తాజా  చిత్రం ‘కొలమావు కోకిల’ (కోకో). ‘అరమ్‌’ వంటి సంచలన చిత్రం తరువాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కావడంతో ‘కోలమావు కోకిల’ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ చిత్రం తో నయనతార కూడా స్టార్స్‌ జతన చేరింది. ఆమె నటించిన ‘కోలమావు కోకిల’ చిత్రాన్ని శుక్రవారం నగరంలో ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు.అది విద్యార్థులకు సెలవు రోజులో, పండగల సమయమో కాదు. అయినా ‘కోకో’ చిత్రాన్ని వేకువజాము ఆటలు ప్రదర్శించడం విశేషం. ఇలా హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఉదయం ఆటలు పడడం ఇదే ప్రథమం. ఆ విధంగా నయనతార ఈ చిత్రంతో స్టార్‌ నటులకు దీటుగా నిలిచిందనే చెప్పాలి.