‘లేడీ సూపర్‌స్టార్‌’.. ఖర్చు చూస్తే బేజార్!

“ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తుంటారు.ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం రూ.75000 – రూ.80000 ఉంటుంది”…. అని ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత కె.రాజన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నయనతార మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది ‘లేడీ సూపర్‌స్టార్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఆమె సినిమాకి తీసుకునే పారితోషికం 6 కోట్లు . తాజాగా నయనతార గురించి ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత కె.రాజన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు…
నయనతార అసిస్టెంట్స్‌ జీతాలు కూడా నిర్మాతే భరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్మాతలకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ… “సినిమా కోసం కాకుండా నిర్మాత అదనంగా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ‘ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తుంటారు. వారందరూ రోజూ నయనతారతోనే సెట్‌లో ఉంటారు. ఆ అసిస్టెంట్స్‌ ఒక్కొక్కరికీ రోజువారీ జీతం రూ.7,000 నుంచి రూ.12,000 ఉంటుంది. అసిస్టెంట్స్‌ జీతాల గురించి చాలామంది చెప్పుకోవడం విన్నాను. అది నిజమే. దీంతో ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం రూ.75000 – రూ.80000 ఉంటుంది”
 
విషయం లేకపోవడంతో… డిజాస్టర్స్
నయనతార.. కెరీర్ సమాప్తం అనుకుంటున్న తరుణంలో… . ఉవ్వెత్తున ఎదగడమే కాకుండా… ‘లేడీ సూపర్ స్టార్’ స్టేటస్ సాధించింది. ఎంచుకున్న పాత్రలతో .. విజయాలతో ఆ స్థాయికి చేరుకుంది నయన్. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అయినా… స్టార్ హీరోల సినిమాలైనా నయన్ క్రేజ్, ఇమేజ్ వేరు…. అయితే ఈ మధ్య ఆమె ఎందుకో సక్సెస్ దారి తప్పుతోంది.గత ఏడాది ఆరంభంలో వచ్చిన ‘విశ్వాసం’ తరువాత నయనతారకి విజయాలే కరువయ్యాయి. ‘ఐరా’, ‘కొలైయుదిర్ కాలమ్’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, ‘మిస్టర్ లోకల్’ వంటి మీడియం రేంజ్ హీరో కాంబినేషన్ సినిమా… ఇలా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో కథ తన పాత్ర చుట్టూ తిరిగినా… ఆ క్యారెక్టర్స్ లో విషయం లేకపోవడంతో… డిజాస్టర్స్ తప్పలేదు. ఇక ‘మిస్టర్ లోకల్’ వంటి పక్కా మాస్ మూవీతోనూ నయన్ కి డిటో సిట్యూయేషన్. ఇక స్టార్ సినిమాలు : చిరంజీవి తో ‘సైరా’…విజయ్ తో ‘విజిల్’ …రజిని తో ‘దర్బార్’ లో ఆమె పాత్ర కేవలం అలంకార ప్రాయం. నయనతారకి మరో ఘనవిజయం రావాల్సిన నమయం ఇది.