పెళ్లి వద్దనుకుంటే ముఖ్యమంత్రి అవుతావు !

న‌య‌న‌తార… వ‌రుస‌గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూప‌ర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ న‌య‌న‌తార‌. వ‌రుస సినిమాల‌తో ఆమె ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉంది. న‌య‌న‌తార గ‌తంలో శింబు, ప్ర‌భుదేవాతో ప్రేమాయణం సాగించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ఉంది. అయితే విఘ్నేష్‌, న‌య‌న్ ఇంకా పెళ్లి పీట‌లు ఎక్క‌లేదు.
న‌య‌న‌తార పెళ్లి గురించి త‌మిళ‌నాట ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం ద‌ర్శ‌కుడు నందు బ‌య‌ట పెట్టిన ఓ విష‌యం. పెళ్లి చేసుకోకుండా అవివాహిత‌గా ఉంటే ఎప్ప‌టికైనా న‌య‌న‌తార త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అవుతుంద‌ని ఓ జ్యోతిష్యుడు చెప్పాడ‌ట‌. పెళ్లి చేసుకుంటే రోడ్డున ప‌డ‌తావ‌ని, అవివాహిత‌గా ఉంటే ముఖ్యమంత్రి అవుతావ‌ని ఆ జ్యోతిష్యుడు న‌య‌న్‌కు చెప్పాడ‌ట‌. శింబుతో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు న‌య‌న‌తార ఆ జ్యోతిష్యుడి వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. ఆ జ్యోతిష్యుడి మాట మీద న‌మ్మ‌కంతోనే న‌య‌న‌తార ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి చేసుకోలేద‌ని త‌మిళ‌నాట అంద‌రూ అనుకుంటున్నారు. తమిళనాడు సినీ తారలను సీఎంలుగా చేసుకున్న ఆ రాష్ట్రంలో సినీ తారలకు గుళ్లు కూడా కడతారు అక్కడి ప్రజలు. అందుకే అక్కడి సినిమా వాళ్లు ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు నయనతారకు ఓ గొప్ప పదవి దక్కుతుందని అంటున్నారు. 
 
హారర్‌ సినిమాలో ద్విపాత్రాభినయం
నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘మా, లక్ష్మీ’ వంటి తమిళ షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా పేరు సంపాదించుకున్న కేఎమ్‌ సర్జున్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన ‘ఆరమ్‌’ (తెలుగులో ‘కర్తవ్యం’) సినిమాను నిర్మించిన కేజేఆర్‌ స్టూడియోస్‌నే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఐరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు.
 
‘‘విభిన్నమైన జానర్స్‌ను ట్రై చేయడానికి ఇష్టపడుతుంటాను. కానీ హారర్‌ జానర్‌ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు ఈ హారర్‌ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమాలోనే నయనతార నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు సర్జున్‌. తెలుగులో చిరంజీవి ‘సైరా’లో నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా మరో మూడు తమిళ సినిమాలు నయనతార చేస్తోంది.