పెళ్లి వాయిదా వేసింది!.. పారితోషికం పెంచేసింది!!

నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె విగ్నేష్ తో ప్రేమలో పడిన విషయం అందరికీ తెలిసిందే. డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం చేస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ.. తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది. వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతుండగా.. తాజాగా విగ్నేష్ కుటుంబానికి షాక్ ఇచ్చింది నయనతార.

నయనతార పెళ్లి పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను నయనతార దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గేవరకు ఆగాలని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఈ విషయాన్ని విగ్నేష్ కుటుంబంతో చెప్పిందట.. విగ్నేష్ కూడా అందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇక మొత్తానికి విగ్నేష్, నయనతార పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనున్నట్లు అర్థమవుతుంది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

పది కోట్లకు పెంచేసింది !… నిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్లు హీరోలకు సరిసమానంగా పారితోషికాలు తీసుకుంటున్నారు. ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార కూడా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుందంట.  బాలీవుడ్ ను మించిన పారితోషికం  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అందుకునేందుకు ఆరాట పడుతోంది. నయనతార నటించిన ‘నేట్రికన్’ విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ఈసినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు గాను దాదాపుగా రూ.20 కోట్ల కు కొనుగోలు చేసిందట. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నయన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 20 కోట్లు ఓటీటీ.. మరో 10 కోట్లు ఇతర రైట్స్ ద్వారా రాబోతున్నాయి. దాంతో తన మార్కెట్ రూ.30 నుండి రూ.40 కోట్లకు పెరిగిన నేపథ్యంలో తన పారితోషికంను ఏకంగా రూ.10 కోట్లకు పెంచాలని నిర్ణయించుకుందట. నిన్న మొన్నటివరకు నాలుగు,ఐదు కోట్ల వరకు ఉన్న రెమ్యునరేషన్ ను ఇప్పుడు నయన్ ఏకంగా 10 కోట్లు చేసింది. ఇంత మొత్తంలో ఇవ్వాలంటే నిర్మాతలకు కష్టమే! మరి.

‘నేట్రికన్’లో ఛాలెంజింగ్ రోల్‌ … నయనతార ‘నేట్రికన్’లో ఓ ఛాలెంజింగ్ రోల్‌తో రాబోతున్నారు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నయన్ ఇండస్ట్రీకొచ్చి పదమూడు ఏళ్ళు దాటింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన ఈమె ఆ తర్వాత పూర్తిగా రూట్ మార్చేసింది. కథా బలమున్న ప్రాజెక్టులనే ఎన్నుకుంటు స్టార్ హీరోయిన్‌గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. కొరియన్ హిట్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్‌గా మర్డర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కనిపించనుంది. తన కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తుండగా క్రాస్ పిక్చర్స్ వారితో కలిసి రౌడీపిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్నాడు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ!… విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు “కాతువాకుల రెండు కాదల్” అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు  అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందే లాంఛ్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇటీవల తమిళ మీడియాలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను పక్కకు పెట్టేశాడని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ కొనసాగించనున్నారట మేకర్స్. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ సమాచారం అందుతోంది.