వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారట!

నయనతార లేడీ సూపర్‌స్టార్‌ మాత్రమే కాదు ..బ్యాచిలర్‌ కూడా. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తూ.. ఏ హీరోయిన్‌ తన దరిదాపులకు రాలేనంతగా వెలిగిపోతోంది ఈ బ్యూటీ. అలాంటి నయనతార వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి విషయాల్లో రెండుసార్లు ఘోరంగా ఓడిపోయి చాలా పాఠాలు నేర్చుకుంది. అందుకే, పెళ్లి జోలికి వెళ్లకుండా.. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని కలిసి గడిపేస్తోంది. ప్రేమ, సహజీవనం అంటూ వార్తల్లో నిలుస్తున్నారీ జంట. ప్రతి సందర్భాన్నీ వేడుకగా జరుపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.పెళ్లి తప్ప అన్నివిషయాల్లో వారు కలగలిసే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ‘పెళ్లి’ అనే పదం నయనతారని తొందరపెడుతోందనే ప్రచారం జరుగుతోంది. జ్యోతిష్యం రూపంలో పెళ్లి ఆమెను వెంటాడుతోందట. బాలాజీ హాసన్‌ అనే స్టార్‌ జ్యోతిష్కుడు పలువురు ప్రముఖులకు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. అదే జ్యోతిష్కుడు నయనతార జాతకాన్ని చెప్పారు. గణితశాస్త్ర జ్యోతిష్కు డైన బాలాజీహాసన్‌ ‘2019లో నటి నయనతార వివాహం జరుగుతుంద’ని గత ఏడాది ఒక టీవీ కార్యక్రమంలో పేర్కొన్నారు.
వీరి పెళ్లి డిసెంబర్‌ 25న ?
విఘ్నేశ్‌శివన్‌ పుట్టిన రోజు వేడుకను నయనతార ఘనంగా నిర్వహించింది. ఈ జంట డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే విఘ్నేశ్‌శివన్, నయనతారల వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి వచ్చే డిసెంబర్‌ 25న జరగనుందనే టాక్‌ నడుస్తోందిఈ జంట వివాహ వేడుకలు 5 రోజుల పాటు నిర్వహిస్తారట. అయితే ఈ వేడుకలు చెన్నైలోనూ, కేరళలోనే కాకుండా.. ఉత్తరాదినో, విదేశాల్లోనో క్రిస్మస్‌ సందర్భంగా జరుపుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
విజయ్‌కి జంటగా నయనతార నటిస్తున్న ‘బిగిల్‌’ దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. అంతకు ముందుగా చిరంజీవి తో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబరు 2న విడుదలవుతోంది. ఇక రజనీకాంత్ తో జత కట్టిన ‘దర్బార్‌’ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి వస్తోంది. త్వరలో ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మాత గా నయనతార నిర్మించనున్న హర్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రంలో మిలింద్‌రావ్‌ దర్శకత్వంలో నటిస్తోంది.