ఆ రింగ్‌ చూపించి అందరికీ షాకిచ్చింది !

నయనతార గత నాలుగేళ్లుగా నయన్‌.. తమిళ సినిమా డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. “ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుందని, అందుకు డబ్బులు కూడబెడుతున్నాం” అంటూ విఘ్నేశ్‌ ఇదివరకే చెప్పేసాడు.
అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై ఎక్కడా మాట్లాడని నయనతార…  తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొని పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలపై ఓపెన్‌ అయ్యింది. ఈ సందర్భంగా తనకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. గతంలో విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి.. రింగ్‌ ఉన్న ఫోటోను హైలేట్‌ చేస్తూ నయన్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.  అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అయి ఉంటుందని పలువురు భావించారు. కానీ దీనిపై ఇరువురు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఇది  కేవలం ఫోటో కోసమేనేమో? అని అనుకున్నారంతా.అయితే,  ఆ వార్తలను నిజం చేస్తూ.. స్వయంగా నయనతార తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్‌ సంతోష పడిపోతున్నారు.

 

మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది!… లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్  నిర్మాతలుగా మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం వీరు తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందిన తమిళ చిత్రం “కూజంగల్” ను ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దర్శకుడి కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

సోషల్ మీడియాలో నయనతార, విఘ్నేష్ శివన్ టైగర్ అవార్డును పట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “మా మొదటి అంతర్జాతీయ పురస్కారం… “కూజంగల్” మాకు ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును రోటర్‌డామ్ నుండి చెన్నైలో ఉన్న ఇంటికి తీసుకువచ్చింది. ఈ రత్నాన్ని తయారు చేసిన దర్శకుడు పిఎస్ వినోద్ రాజ్, చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రశంసలు పొందడం మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది!” అంటూ పోస్ట్ చేశారు. ఇక నయన్, విఘ్నేష్ ప్రస్తుతం”కాతు వాకుల రెండు కాదల్” సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.