సన్నీలో మనకు తెలియని కొత్త సంగతులు

ముందుగా పోర్న్‌స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులరై ఆతర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తాచాటిన హాట్ బ్యూటీ సన్నీలియోన్. ఈ భామ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ రెండు, మూడు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో గ్లామరస్ తారగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సన్నీలియాన్‌లో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయట. సన్నీలియాన్ 2011లో డానియల్ వెబర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ చక్కగా కాపురం చేస్తూ కలిసే ఉంటున్నారు. ఒక పోర్న్ స్టార్ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో కాలంగా కలిసి ఉండటం అన్నది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉందని అంటోంది సన్నీలియాన్.

ఇక ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు సన్నీ ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీ తన సేవలను అందిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ముంబైలోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ స్కూల్‌కు కావల్సిన వసతులను సమకూరుస్తోంది. సన్నీలియాన్ ఓ మంచి చెఫ్ కూడానట. ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త వెబర్‌కు తానే స్వయంగా వంటచేసిపెడుతుందట. అంతటి అన్యోన్య దాంపత్య జీవితం వారిద్దరిది. వంట చేయడమంటే ఒక మహిళగా తనకు చాలా ఇష్టమని చెబుతోంది.  ఇక తనను పోర్న్‌స్టార్‌గా ఇప్పటికీ చూస్తూ కొందరు తనపై చేసే కామెంట్లను ఎంతో సహనంతో భరిస్తోందట సన్నీ. ఇలా ఈ అమ్మడిలో ఒక మంచి గృహిణి, ఒక మంచి సామాజిక కార్యకర్త, మంచి నటి ఉండడం విశేషమే మరి.

‘పెటా’ కోసం సన్నీలియోన్ నగ్న ప్రదర్శన

జంతు సంరక్షణ సంస్థ పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్)కు బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రచారకర్త అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా జంతు సంరక్షణ ప్రచారంలో భాగంగా భర్త డెనియల్ వెబర్‌తో కలిసి ఆమె నగ్న ఫోటోలకు ఫోజులిచ్చింది. జంతువులను చంపి వాటి చర్మంతో తయారు చేసే వస్త్రాలను ధరించకూడదనే సందేశాన్ని ఈ నగ్నత్వంలోనే గ్రహించాలని సన్నీ అభిమానులకు కోరడం గమనార్హం. ఈ ఫోటోను పెటా ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.