అడివిశేష్‌, శివాని ల చిత్రం ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అడివి శేష్ హీరోగా  ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది. వెంక‌ట్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన `2 స్టేట్స్` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌న‌య శివాని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచయం అవుతున్నారు. శివాని తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటన కు ఎంతో ఆస్కారం ఉన్న ఈ కథను ఎంచుకోవడం విశేషం. బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్క‌నుంది.  దర్శకుడు వెంకట్ రెడ్డి  వి.వి. వినాయక్ తో అసోసియేట్ గా  చాలా చిత్రాలకు పనిచేసారు.  ఈ  సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత : ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం :  వెంక‌ట్ రెడ్డి.

New film of Adivi Sesh, Shivani to be shot from February

Lakshya Productions is all set to produce acclaimed actor Adivi Sesh’s next movie.  This will go on the floors sometime in February.  To be directed by Venkat Reddy (a disciple of VV Vinayak), this romantic-cum-family entertainer will be bankrolled by MLV Satyanarayana.  This untitled project is an official remake of the Hindi film ‘2 States’.

Paired up with the versatile Sesh is the promising debutante Shivani, the daughter of Dr. Rajasekhar-Jeevitha duo.  If the ‘Kshanam’, ‘Baahubali’ and ‘Goodachari’ actor,  Sesh, is known for cherry-picking the best scripts, Shivani has taken the decision to debut with this film because she thoroughly loved the “beautiful script”.  With the duo on board, this is surely one of the most youthful films in the making.
Anup Rubens will compose the music.  MS Kumar is the Executive Producer.  The makers will announce the details of other cast and crew members soon.